Home > జాతీయం > Rs 2000 Notes Deadline extended: రూ. 2 వేల నోట్ల మార్పిడి గడువు పెంపు... ఎప్పటివరకంటే..

Rs 2000 Notes Deadline extended: రూ. 2 వేల నోట్ల మార్పిడి గడువు పెంపు... ఎప్పటివరకంటే..

Rs 2000 Notes Deadline extended: రూ. 2 వేల నోట్ల మార్పిడి గడువు పెంపు... ఎప్పటివరకంటే..
X

రద్దయిన రూ. 2000 నోట్ల మార్పిడి గడువును కేంద్రం పొడిగించింది. అక్టోబర్ 7వ తేదీ వరకు వీటిని బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చని రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా శనివారం తెలిపింది. మార్పిడి గడువు ఈ రోజు(సెప్టెంబర్ 30)తో ముగిసింది. ఏదైనా అనివార్య కారణాలతో డిపాజిట్ చేయలేని వారికి చివరి అవకాశం కల్పించేందుకు గడవు పెంచారు. రూ.2000 అక్టోబర్ 7 వరకు నోట్ల చలామణిలో ఉంటాయి. అక్టోబర్ 8 నుంచి బ్యాంకులు ఆ నోట్లను స్వీకరించవు. అయితే దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాయాల్లో నిర్దేశించిన నిబంధనలకు మేరకు ర్పిడి చేసుకోవచ్చు. ఆ కార్యాలయాలకు పోస్టులో కూడా పంపుకోవచ్చు. ఈ ఏడాది మే 19న 2వేల నోటును వెనక్కి తీసుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఈ నోట్లలో ప్రస్తుతం 0.14 లక్షల కోట్ల విలువైనవి మాత్రమే చలామణి ఉన్నాయి.


Updated : 30 Sept 2023 6:22 PM IST
Tags:    
Next Story
Share it
Top