Home > జాతీయం > RS Praveen Kumar : సిర్పూర్ స్థానాన్ని అందుకే ఎంచుకున్నా: ఆర్.ఎస్. ప్రవీణ్

RS Praveen Kumar : సిర్పూర్ స్థానాన్ని అందుకే ఎంచుకున్నా: ఆర్.ఎస్. ప్రవీణ్

RS Praveen Kumar  : సిర్పూర్ స్థానాన్ని అందుకే ఎంచుకున్నా: ఆర్.ఎస్. ప్రవీణ్
X

బీఎస్పీ (బహుజన సమాజ్ వాద్ పార్టీ) ఎవరికీ బీ టీం కాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. నేషనల్ అకడమిక్ సర్వేలో తెలంగాణ 28వ స్థానంలో ఉందని, మరి కేసీఆర్ చెప్తున్న నంబర్ వన్ అభివృద్ధి ఎక్కడ జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజల సొమ్మును గంగపాలు చేశారని మండిపడ్డారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతీ ఒక్కరికి పక్కా ఇల్లు కట్టిస్తామని, రైతు బంధును క్రమబద్ధీకరిస్తామని చెప్పుకొచ్చారు. రానున్న ఎన్నికల్లో 100కు పైగా స్థానాల్లో పోటీచేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, తాను బహుజనులు వదిలిన బాణాన్ని అని అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక విద్యార్థులు, నిరుద్యోగుల భవిశ్యత్తును నాశనం చేసిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. తమ పార్టీకి అధికారం ఇస్తే మొదటిరోజే టీఎస్పీఎస్సీని సిఫారసు చేసి, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. పూలే విద్యా భరోసా కింద విద్యార్థులకు రూ. 12 వేలు, ఏళ్లుగా గవర్నమెంట్ జాబ్ కోసం కోచింగ్ తీసుకున్న ఉద్యోగం రాని వారికి ఫ్రీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటుచేస్తామని ప్రకటించారు.

బహుజనులకు బలమైన, అమ్ముడుపోని, రాజీపడని, ప్రగతిశీల గొంతుగా నిలబడటమే బీఎస్పీ పార్టీ లక్ష్యం అని చెప్పారు. అందుకే వెనకబడిన, బహుజనులు ఎక్కువగా ఉన్న సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్లు వివరించారు. ఆంధ్ర వలస నేతల చేతుల్లో సిర్పూర్ మగ్గిపోతుందని.. దోపిడి, కబ్జా, రౌడీయిజంతో నలిగిపోతుందని ఫైర్ అయ్యారు. కోనప్ప మాఫియా నుంచి సిర్పూర్ ను రక్షించడమూ తమ లక్ష్యం అని తెలిపారు. తాను బహుజనులు వదిలిన బాణాన్నని, తనకు రక్త సంబంధం కన్నా వర్ణం సంబంధమే గొప్పదని స్పష్టం చేశారు. బీఎస్పీ ఎవరికీ బీటీం కాదని, బీఆర్ఎస్ పార్టీనే బీజేపీకి బీటీం అని విమర్శించారు.




Updated : 8 Nov 2023 5:55 AM GMT
Tags:    
Next Story
Share it
Top