Home > జాతీయం > Google : గూగుల్‌లో ఆ తప్పు చూపినందుకు రూ.1.12 కోట్ల బహుమతి!

Google : గూగుల్‌లో ఆ తప్పు చూపినందుకు రూ.1.12 కోట్ల బహుమతి!

Google : గూగుల్‌లో ఆ తప్పు చూపినందుకు రూ.1.12 కోట్ల బహుమతి!
X

నేటి రోజుల్లో గూగుల్ వాడనివారంటూ ఎవ్వరూ ఉండరు. స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ గూగుల్‌ను కచ్చితంగా వినియోగిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు గూగుల్‌ సమాచారంపైనే ఆధారపడి ఉంటాయి. అటువంటి గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ఏదైనా తప్పు ఉన్నట్లు తెలియజేస్తే ఆ కంపెనీ భారీ మొత్తంలో బహుమతిని అందిస్తుంది. తాజాగా అలా గూగుల్‌లో తప్పును చూపినందుకు ఓ వ్యక్తికి ఏకంగా రూ.1.12 కోట్లను బహుమతిగా అందించింది.

గూగుల్ కంపెనీ తన లోపాలను గుర్తించేందుకు 'వర్నరబిలిటీ రివార్డ్' అనే ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనేవారు గూగుల్‌లో ఉన్న లోపాలను గుర్తించి చెప్పాల్సి ఉంటుంది. అది నిజమని తేలితేనే ఆ తప్పును గుర్తించిన వారికి బహుమతిని గూగుల్ అందిస్తుంది. ఆ రివార్డు కూడా సాధారణంగా ఉండదు. కోట్లల్లోనే రివార్డు ఉండటంతో చాలా మంది ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనేందుకు ఎదురుచూస్తారు.

తాజాగా గూగుల్ నిర్వహించిన ‘వర్నరబిలిటీ రివార్డ్’ అనే కార్యక్రమంలో భారత్ లోని కేరళకు చెందిన శ్రీరామ్ అనే వ్యక్తి పాల్గొని గూగుల్ తప్పును ఎత్తిచూపాడు. గూగుల్ లోని సెక్యూరిటీ లోపాలను గుర్తించిన శ్రీరామ్ కంపెనీకి తెలియజేయడంతో అతనికి 1,35,979 డాలర్లు అందాయి. అంటే అది భారత కరెన్సీలో 1,12,86,257 కోట్లను శ్రీరామ్ బహుమతిగా అందుకున్నాడు. ఆ డబ్బులతో తాను కూడా ఓ కంపెనీని నిర్వహించి చాలా మందికి ఉపాధి చూపుతానని శ్రీరామ్ చెప్పుకొచ్చాడు.


Updated : 27 Jan 2024 1:49 PM GMT
Tags:    
Next Story
Share it
Top