Home > జాతీయం > యూత్‌ కాంగ్రెస్‌ సమావేశంలో కుర్చీలతో కొట్టుకున్నారు ...వీడియో వైరల్

యూత్‌ కాంగ్రెస్‌ సమావేశంలో కుర్చీలతో కొట్టుకున్నారు ...వీడియో వైరల్

యూత్‌ కాంగ్రెస్‌ సమావేశంలో కుర్చీలతో కొట్టుకున్నారు ...వీడియో వైరల్
X

మహారాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ సమావేశం రసాభాసగా మారింది. ముంబయిలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో యువనేతలు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్‌ సమక్షంలోనే రెండు వర్గాలుగా విడిపోయి కొట్లాటకు దిగారు. ప్రస్తుతం ఈ ఫైటింగ్ కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహారాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కునాల్‌ నితిన్‌ రౌత్‌ను తొలగించాల్సిందిగా ఒక వర్గం డిమాండ్ చేయడం గొడవ మొదలైంది. వారితో నితిన్‌ రౌత్‌ అనుకూల వర్గం వాగ్వాదానికి దిగింది. ఇది కాస్త ఘర్షణ దారితీయడంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కుర్చీలతో దాడి చేసుకున్నారు. గొడవను సీనియర్ యూత్ కాంగ్రెస్ నాయకులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో సమావేశం అర్ధాంతరంగా వాయిదా వేశారు.

Updated : 17 Jun 2023 10:29 PM IST
Tags:    
Next Story
Share it
Top