Home > జాతీయం > Ayodhya Ram mandir: రాముని ప్రాణ ప్రతిష్ట రోజు ఇలాంటి పనులు చేస్తే అశుభం

Ayodhya Ram mandir: రాముని ప్రాణ ప్రతిష్ట రోజు ఇలాంటి పనులు చేస్తే అశుభం

Ayodhya Ram mandir: రాముని ప్రాణ ప్రతిష్ట రోజు ఇలాంటి పనులు చేస్తే అశుభం
X

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ వేడుకకు అయోధ్య సిద్ధమైంది. అయోధ్యతో పాటు దేశమంతా రాముని ప్రత్యేక పూజలు చేయనున్నారు. మరి కొద్దిగంటల్లో అయోధ్య బాలరాముడి విగ్రహా ప్రాణప్రతిష్ఠ జరుగునుంది. ఈ శుభముహూర్తాన మీరు కూడా మీ ఇంట్లో కొన్ని మంచి పనులు చేస్తే మీ ఇంట సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయంటున్నారు జ్యోతిష్య పండితులు. ప్రతి హిందువు తమ ఇళ్లలో రాముని విగ్రహం అమర్చుకుని పూజలు చేయాలంటున్నారు. శ్రీరాముడి ఆగమనానికి గుర్తుగా ఇంటి నలువైపులా దీపం వెలిగించాలి. ఇంట్లో ప్రధాన గుమ్మానికి ఇరువైపులా దీపం పెట్టడం వల్ల ఆ ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయి. అయోధ్యలో రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఇంట్లో కర్పూరం ధూపం పెట్టాలి, తరువాత ఇంట్లో రాముడికి పాయసం బోగం సమర్పించాలి. ఆ తరువాత ప్రసాదాన్ని అందరికీ పంచాలి. రేపు వీలైనంతవరకూ పేదలకు, ఆపన్నులకు పండ్లు ప్రదానం చేయాలి. దాంతోపాటు నిస్సహాయులకు , నిరుపేదలకు వెచ్చని దుస్తులు దానం చేయాలి. రేపు ఇంట్లో రామాయణం పఠించాలి. హనుమాన్ చాలీసా సైతం పఠించాలి.

ప్రాణ ప్రతిష్ఠ నియమాలు

ప్రాణ ప్రతిష్ట చేయడానికి, ఆలయం సరైన దిశలో ఉండాలి. మీ ఇంట్లో ఈశాన్య దిశలో పూజ చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు.

ఈ దిశలో తప్ప మరే దిక్కులోనూ పూజలు చేయరాదంటున్నారు.

రామ్ లల్లా పవిత్రోత్సవం రోజున, మద్యం లేదా నాన్ వెజ్ తీసుకోవద్దు, ఎలాంటి మత్తుపదార్థాలు తీసుకోవద్దు. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుందని అంటున్నారు.

ఇంటి శుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. పూజ చేసే ముందు దేవతామూర్తుల విగ్రహాలను నీరు, గంగాజలంతో శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.

అంతే కాకుండా ఈ రోజు పొరపాటున కూడా మీ ఇంటి గుడిలో చీకటి పడనీయకండి. గుడిలో దీపాలు, లైట్లు తప్పకుండా వెలిగించండి. ఇది ఇంట్లో ఆనందం, శాంతిని కలిగిస్తుంది.

'ఈ సమాచారం కేవలం వివిధ మాధ్యమాలు, జ్యోతిష్యులు, పంచాంగాల నుంచి సేకరించినది మాత్రమే, దీనిపై విశ్వసనీయతకు ఎలాంటి హామీ లేదు'




Updated : 21 Jan 2024 11:44 AM IST
Tags:    
Next Story
Share it
Top