Home > జాతీయం > Seema Haider: సచిన్ బిడ్డకు తల్లి కాబోతున్న సీమా హైదర్

Seema Haider: సచిన్ బిడ్డకు తల్లి కాబోతున్న సీమా హైదర్

Seema Haider: సచిన్ బిడ్డకు తల్లి కాబోతున్న సీమా హైదర్
X

పబ్జీ గేమ్ కలిపిన ప్రేమ కథగా వార్తల్లోకెక్కిన జంట సీమా హైదర్, సచిన్ మీనా గురించి అందరికీ తెలిసిందే. పాకిస్తాన్ లోని సీమా, తన నలుగురు పిల్లలతో.. అక్రమంగా భారత్ లోని తన ప్రియుడు సచిన్ కు కలిసిన విషయం తెలిసిందే. అక్రమంగా భారత్ లోకి వచ్చిన అందరి దృష్టిని ఆకర్శించిన సీమా.. ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయింది. ప్రస్తుతం సచిన్, సీమాల వైవాహిక జీవితం సాఫీగా కొనసాగుతుంది. ఈ క్రమంలో కొత్త ఏడాది ఈ సెన్సేషనల్ దంపతులు ఓ శుభవార్త చెప్పారు. తాను గర్భందాల్చినట్లు చెప్పారు. ఒక ప్రైవేట్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వార్తను పంచుకున్నారు. సచిన్ తండ్రి కూడా ఈ వార్త నిజమేనని, సీమా హైదర్ గర్భవతి అని స్పష్టం చేశారు.

పాకిస్తాన్ జాతీయురాలైన 30 ఏళ్ల సీమా.. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన 22 ఏళ్ల సచిన్ ను పబ్జీ గేమ్ ద్వారా పరిచయం ఏర్పాడింది. దాంతో తన నలుగురు పిల్లలతో సీమా.. పాక్ సరిహద్దులు దాటి గేతేడాది భారత్ లోకి ప్రవేశించింది. అనంతరం సచిన్ మీనాను వివాహం చేసుకున్న సీమా.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో నివాసముంటున్నారు. సీమా, సచిన్ తల్లిదండ్రులు కాబోతున్నారనే విషయం తెలియడంతో సోషల్ మీడియాలో కొందరు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరికొందరు అయితే వారిని ట్రోల్ చేస్తున్నారు.

Updated : 2 Jan 2024 3:58 PM GMT
Tags:    
Next Story
Share it
Top