Home > జాతీయం > కాంగ్రెస్కు మరో తలనొప్పి.. సొంత పార్టీ పెట్టే యోచనలో కీలక నేత

కాంగ్రెస్కు మరో తలనొప్పి.. సొంత పార్టీ పెట్టే యోచనలో కీలక నేత

కాంగ్రెస్కు మరో తలనొప్పి.. సొంత పార్టీ పెట్టే యోచనలో కీలక నేత
X

కర్నాటకలో గెలుపుతో జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి మొదలైంది. రాజస్థాన్లో పార్టీ నేతల వర్గపోరు మరోసారి తెరపైకి వచ్చింది. సీఎం అశోక్ గెహ్లాట్ పై గుర్రుగా ఉన్న మరో నేత సచిన్ పైలెట్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గెహ్లాట్ విషయంలో పార్టీ హైకమాండ్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఆయన కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి సొంత కుంపటి పెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

జూన్ 11న కొత్త పార్టీ

సచిన్ పైలెట్ జూన్ 11న కొత్త పార్టీ పేరు ప్రకటించే అవకాశమున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ నడుస్తోంది. జూన్ 11న తన తండ్రి రాజేష్ పైలెట్ వర్థంతి కావడంతో కొత్త పార్టీ ప్రకటనకు ఆ రోజునే ముహూర్తం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తన డిమాండ్లపై కాంగ్రెస్ హైకమాండ్ తీసుకునే నిర్ణయం ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని సచిన్ పైలెట్ డిసైడైనట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అదే రోజు సచిన్ భారీ ర్యాలీకి ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నా వాటిని ఖండించారు. జూన్ 11న రాజేష్ పైలెట్ నియోజకవర్గమైన దౌసాలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

గెహ్లాట్ రాజే మధ్య ఒప్పందం

బీజేపీ నేత వసుంధర రాజే అవినీతిపై చర్యలు తీసుకునే విషయంలో పైలెట్ కాంగ్రెస్ హైకమాండ్ కు ఇప్పటికే అల్డిమేటం ఇచ్చారు. ఆమెతో ఉన్న ఒప్పందం కారణంగానే సీఎం అశోక్ గెహ్లాట్ రాజేపై చర్యలు తీసుకోవడం లేదని సచిన్ పైలెట్ ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణల్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. తాను డిమాండ్ చేసిన అవినీతి కట్టడి, యువత సమస్యల పరిష్కారం, పేపర్ లీకేజీపై దర్యాప్తు తదితర అంశాలపై పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయం ఆధారంగా అడుగువేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పైకి మాత్రమే ఐకమత్యం

రాజస్థాన్ కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పార్టీ హైకమాండ్ గత నెలలో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ ను ఢిల్లీకి పిలిపించింది. దాదాపు నాలుగు గంటల పాటు వారితో చర్చించింది. అయినా ఫలితం కనిపించలేదు. పైకి ఇద్దరు నేతలు ఐకమత్యంగా ఉన్నామని చెబుతున్నా, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి కట్టుగా పనిచేస్తామని చెబుతున్నా వారి మధ్య అంతరం మాత్రం అలాగే కొనసాగుతోంది.

2018లో మొదలైన వర్గ పోరు

2018 రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం అనంతరం గెహ్లాట్, పైలెట్ మధ్య వర్గపోరు మొదలైంది. ముఖ్యమంత్రి పీఠం కోసం ఇద్దరూ ప్రయత్నించినా చివరకు ఆ అవకాశం అశోక్ గెహ్లాట్ కు దక్కింది. సచిన్ పైలెట్ డిప్యూటీసీఎం పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండేండ్ల అనంతరం తిరుగుబాటు బావుటా ఎగరేసిన ఆయన.. అధికార పంపిణీలో సమన్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అప్పట్లో దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు గెహ్లాట్ కు అండగా నిలవగా.. పైలెట్ కు కనీసం 20 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా లభించలేదు. గతేడాది కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు గెహ్లాట్ కు అప్పగించడాన్ని నిరసిస్తూ 72 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో ఇరువురు నేతల మధ్య దూరం మరింత పెరిగింది.

Updated : 6 Jun 2023 4:23 PM GMT
Tags:    
Next Story
Share it
Top