Home > జాతీయం > డీప్ ఫేక్ ఫొటోలపై సారా టెండుల్కర్ ఆవేదన

డీప్ ఫేక్ ఫొటోలపై సారా టెండుల్కర్ ఆవేదన

డీప్ ఫేక్ ఫొటోలపై సారా టెండుల్కర్ ఆవేదన
X

ఇటీవల కాలంలో సెలబ్రిటీల డీప్‌ఫేక్‌ వీడియోలు వైరల్‌ అవడం సంచలనం రేపుతోంది. రష్మిక డీప్ ఫేక్ పెద్ద కలకలమే రేపింది. ప్రముఖులు సైతం దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ కూతురు డీప్ ఫేక్ పై స్పందించారు. తన డీప్‌ఫేక్‌ వీడియోలు కూడా నెట్టింట వైరల్‌ అయ్యాయని ఆందోళన వ్యక్తం చేసింది. ట్విటర్‌లో తన పేరుతో కొంతమంది నకిలీ ఖాతాలు తెరిచి పోస్టులు పెడుతున్నారని తెలిపింది.

‘‘మన ఆనందాలు, బాధలను పంచుకునేందుకు సోషల్‌ మీడియా ఒక అద్భుతమైన వేదిక. కానీ కొందరు టెక్నాలజీని దుర్వినియోగం చేయడం దురదృష్టకరం. సోషల్‌ మీడియాలో నా డీప్‌ఫేక్‌ ఫొటోలు కూడా వైరల్‌ కావడం చూశా. ట్విటర్‌లో కొందరు నా పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి.. నెటిజన్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. నాకు ట్విటర్‌లో అసలు అకౌంటే లేదు. అలాంటి నకిలీ ఖాతాలను ట్విట్టర్ సంస్థ గుర్తించి.. వాటిని సస్పెండ్‌ చేస్తుందని ఆశిస్తున్నా. నిజాలను దాచి వినోదం పంచకూడదు. విశ్వసనీయత, నిజాలు ఉండే కమ్యూనికేషన్‌ను ప్రోత్సహించాలి’’ అని సారా ఇన్స్టాలో రాసుకొచ్చింది.

Updated : 22 Nov 2023 8:45 PM IST
Tags:    
Next Story
Share it
Top