రెజ్లర్లు ఆందోళన విరమించారంటూ వార్తలు.. ఖండించిన సాక్షిమాలిక్
X
కేంత్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అనంతరం ప్రముఖ రెజర్లు ఆందోళనను విరమించారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ముందుగా సాక్షిమాలిక్ తన ఆందోళన విరమించి తన రైల్వే విధుల్లో చేరారంటూ ప్రచారం సాగింది. అనంతరం సాక్షిమాలిక్‌తో పాటు బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ కూడా తపుకున్నారంటూ టీవీలు, సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలను సాక్షిమాలిక్ ఖండించింది. తమ నిరససన కొనసాగుతోందని స్పస్టం చేసింది. ఆందోళనల నుంచి తాను కాని, వినేష్ ఫోగట్ కాని, బజరంగ్ పూనియా కాని తప్పుకోవడం లేదని సాక్షి మాలిక్ ట్వీట్ చేసింది. తాము తమ ఉద్యోగాలలో తిరిగి చేరామే తప్ప నిరసన నుంచి ఉపసంహరించుకోలేదని సాక్షిమాలిక్ వివరించింది. "న్యాయం కోసం చేస్తున్న పోరాటంలో మేమేమీ వెనక్కు తగ్గలేదు. రైల్వేలో నా బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతోంది. దయచేసి ఎలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దు" అని సాక్షిమాలిక్ ట్వీట్ చేశారు.
తమపై లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లర్ సమాఖ్య చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలంటూ గత కొన్ని రోజులుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీ వేదికగా చేస్తున్న ఈ ఆందోళన ఇటీవల తీవ్ర రూపం దాల్చాయి. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి భేటీ అయ్యారు. రాత్రి రెజ్లర్లతో అమిత్ షా సమావేశామయ్యారు. ఈ భేటీలో రెజ్లర్లు బజ్‌రంగ్ పునియా, సాక్షి మాలిక్, సంగీతా ఫొగాట్ పాల్గొన్నారు. సుమారు రెండు గంటలు పాటు చర్చలు సాగాయి. రెజర్లల ఆరోపణలు విన్న అమిత్ షా.. పూర్తి విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీ అనంతరం టాప్ రెజ్లర్లు ఆందోళనలు విరమించారనే వార్తలు వచ్చాయి.అమిత్ షాతో భేటీపై సాక్షి మాలిక్ భర్త సత్యవ్రత్ కడియన్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. అమిత్ షాతో జరిగిన రెజ్లర్ల సమావేశం అసంపూర్తిగా ఉందని వివరించారు. కేంద్రహోంమంత్రి నుంచి ఆశించిన స్పందన రాలేదని చెప్పారు.
మరోవైపు జూన్ 9 లోపు బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని రైతు సంఘాలు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాయి. లేకపోతే దేశ వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని రైతు నాయకుడు నరేష్ టికాయత్ హెచ్చరించారు.