Home > జాతీయం > చంద్రయాన్‌ 3 లో ప్రయాణించిన వారికి నా సెల్యూట్‌.. మంత్రి కామెంట్

చంద్రయాన్‌ 3 లో ప్రయాణించిన వారికి నా సెల్యూట్‌.. మంత్రి కామెంట్

చంద్రయాన్‌ 3 లో ప్రయాణించిన వారికి నా సెల్యూట్‌.. మంత్రి కామెంట్
X

చంద్రయాన్-3 ప్రయోగం సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. పిల్లలు, పెద్దలు ఈ విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి ల్యాండర్ మనదే కావడంతో ప్రపంచ దేశాలన్నీ ‘జయహో భారత్’ అని వేనోళ్లా కీర్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రయాన్-3 ప్రయోగం గురించి ప్రశంసించబోయి రాజస్థాన్‌కు చెందిన క్రీడా శాఖా మంత్రి అశోక్ చంద్నా తన పరువు పోగొట్టుకున్నారు.





చంద్రయాన్‌ ౩ విజయవంతం అయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రయాన్‌ ౩ లో ప్రయాణించిన వ్యోమగాములకు నా సెల్యూట్‌ అంటూ గొప్పగా చెప్పారు. చంద్రుడిపై సేఫ్‌ ల్యాండ్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉందని, అందులో ప్రయాణించిన వారికి సెల్యూట్‌ చేస్తున్నానని, సైన్స్‌ స్పేస్‌ రిసెర్చిలో ఇండియా మరో అడుగు వేసిందని, ఈ సందర్భంగా భారత పౌరులందరికీ కూడా శుభాంకాక్షలు చెప్తున్నానని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ కావడంతో నెటిజన్లు ఆయన్ను ఆడేసుకుంటున్నారు. మంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఈ మాత్రం అవగాహన కూడా లేకుండా ఎలా మాట్లాడారంటూ మండిపడుతున్నారు.

ఎందుకంటే.. మనుషులను తీసుకెళ్లడానికి చంద్రయాన్-3 హ్యుమన్ స్పేస్ మిషన్ కాదు. ఇండియన్ మూన్ మిషన్. కానీ ఆయన ఏమాత్రం ఐడియా లేకుండా సాధారణంగా మీడియాతో మాట్లాడేసి వెళ్లిపోయారు. ఈ వీడియో ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్లు.. సీక్రెట్‌ న్యూస్‌ లీకైందని, రాజస్థాన్‌ మంత్రి సీక్రెట్‌గా వ్యోమగామిని చంద్రుడిపైకి పంపారని జోకులు వేస్తున్నారు. మన దేశంలోని కొందరు రాజకీయ నాయకులకు ఉన్న విషయ పరిజ్ఞానం ఏపాటిదో ఈ తరహా వ్యాఖ్యలు మరోసారి రుజువు చేశాయంటున్నారు.




Updated : 24 Aug 2023 8:30 AM GMT
Tags:    
Next Story
Share it
Top