చంద్రబాబు అరెస్ట్‌పై అఖిలేశ్ ఫైర్
X
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. బాబు అరెస్ట్, రిమాండ్ అక్రమం అంటూ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసనలు చేస్తున్నారు. తాజాగా బాబు అరెస్టుపై ఇండియా కూటమి సభ్యులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఆయన అరెస్టును ఖండిస్తున్నారు. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బాబు అరెస్టును తప్పుపట్టారు. ఓ మాజీ సీఎంను ఇలా అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదని ఆమె అన్నారు. తాజాగా సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కూడా బాబూ అరెస్టుపై ట్విటర్ వేదికగా స్పందించారు.
"ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఓ ట్రెండ్‌గా మారింది. బాబు అరెస్ట్ చట్ట విరుద్ధం. ఆయన అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతిపక్ష నేతలను జైలుకు పంపించడం నిరంకుశ పాలనకు నిదర్శనం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి చోటు లేదు. బీజేపీ, ఆ పార్టీకి అవకాశవాదులు గుర్తుంచుకోండి. తప్పనిసరిగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. స్వార్థపూరితమైన బీజేపీ పార్టే మరే పార్టీకి మిత్రుడు కాదు." అంటూ చంద్రబాబును ట్యాగ్ చేస్తూ అఖిలేశ్ ఈ ట్వీట్ చేశారు. ట్వీట్ మాత్రమే కాదు అఖిలేశ్ స్వయంగా టీడీపీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడికి ఫోన్ చేశారు. బాబు అరెస్టు, ఆ తర్వాత జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. బాబు ఫ్యామిలీతోనూ మాట్లాడతానని తెలిపారు.
विपक्ष के नेताओं को गिरफ़्तार करने का चलन अब केंद्र से लेकर राज्यों तक प्रचलन बन गया है। जो सत्ता के साथ नहीं आ रहा है उसे जेल में डाल दो, ये निरंकुश शासकों की नीति होती थी, लोकतंत्र में इसके लिए कोई स्थान नहीं है।
— Akhilesh Yadav (@yadavakhilesh) September 12, 2023
भाजपाई और उनके अवसरवादी मित्र याद रखें कि राजनीतिक व्यवहार में…