సనాతన ధర్మం' వివాదం.. ఉదయనిధికి సుప్రీం నోటీసులు
X
సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin), డీఎంకేకు చెందిన ఎంపీ ఏ రాజా, మరో 14 మందికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఉదయనిధి స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగిందిద. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు (Supreme Court) వరకు చేరింది. ఉదయనిధి స్టాలిన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. తమిళనాడు ప్రభుత్వం, ఉదయనిధికి నోటీసులు జారీ చేసింది.
కొన్ని రోజుల క్రితం తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ.. ‘‘కొన్నింటిని వ్యతిరేకించలేం. నిర్మూలించాల్సిందే. డెంగ్యూ, మలేరియా, కరోనాలను వ్యతిరేకించలేం. సనాతన ధర్మం కూడా అలాంటిదే. సనాతన అనేది సంస్కృత పదం. సామాజిక, సమానత్వానికి విరుద్ధం. నిర్మూలించాల్సిందే’’ అని అన్నారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. రెండ్రోజుల క్రితం కూడా సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని క్లారిటీ ఇచ్చారు ఉదయ్‌నిధి. మనుషుల్లో అంటరానితనం నశించాలంటే సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని పిలుపునిచ్చారు. సనాతన ధర్మం వల్లే అంటరాని తనం వచ్చిందని, అందుకే సనాతన ధర్మం ఉండకూడదు అని ఉదయనిధి అన్నారు.
Sanatan Dharma Row: Supreme Court Issues Notice To Udhayanidhi Stalin
New Delhi, Supreme Court today , issued notice , Tamil Nadu government , DMK leader, Udhayanidhi Stalin, remarks on 'Sanatan Dharma', Tamil Nadu Minister , diseases , dengue and malaria