Bhajan Lal Sharma : రాజస్థాన్ సీఎంగా తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యే
X
రాజస్థాన్ నూతన సీఎం అభ్యర్థి ఎంపికలో బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఎవరు ఊహించని నేతను సీఎంగా ఎంపిక చేసింది. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్ శర్మ ఎన్నికయ్యారు. జైపూర్లో జరిగిన సమావేశంలో శాసనసభాపక్ష నేతగా భజన్‌లాల్ శర్మను ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. దియా కుమారి, ప్రేమ్ చంద్ బైర్వా డిప్యూటీ సీఎంలుగా వ్యవహరించనున్నారు. కాగా భజన్ లాల్ సంగనేర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఉన్న ఎన్నికయ్యారు.
ప్రస్తుతం భజన్లాల్ పార్టీ సీనియర్ కార్యదర్శిగా ఉన్నారు. అయితే సీఎం రేసులో వసుంధర రాజే, గజేంద్ర షెకావత్, మహంత్ బాలాకాంత్, దియా కుమారి, అనిత భదేల్, అర్జున్ రామ్ మేఘ్వాల్ ఉన్నా.. అధిష్ఠానం తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన భజన్ లాల్ శర్మ వైపే మొగ్గుచూపింది. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికలు జరగ్గా.. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. మూడు రాష్ట్రాల్లోనూ కొత్తవారికే సీఎంగా అవకాశం కల్పించింది.