Sania Mirza : మీరు మీలాగే ఉండండి.. అమ్మాయిలకు సానియా సూచన
X
(Sania Mirza) ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖులు, స్పోర్ట్స్ స్టార్స్ ల విడాకులు హాట్ టాపిగ్ మారాయి. ఎంత తొందరగా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారో.. అంతే త్వరగా విడాకులు తీసుకుని ఫ్యాన్స్ కు షాకిస్తున్నారు. అలా ఇటీవల తెగదెంపులు చేసుకున్న వారే.. సానియా మీర్జా, షోయబ్ మాలిక్. చాలాకాలంగా వీరి విడాకుల విషయంలో వస్తున్న రూమర్స్ కు.. తాజాగా బ్రేక్ పడింది. విడాకులు తీసుకుంటున్నట్లు ఇద్దరూ ప్రకటించారు. ఈ విషయం చర్చల్లో ఉండగానే.. షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్నాడు. అయితే షోయబ్ పెళ్లిళ్ల ప్రస్తావన తీస్తూ.. సానియా కొడుకును తోటి విద్యార్థులు ఆట పట్టిస్తున్నారట.
ఈ వార్త మరవక ముందే మరో వార్త సోషల్ మీడియాలో వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సానియా.. అక్కడ కొత్తగా పెళ్లైన కంటెంట్ క్రియేటర్ అంకితా సహిగల్ కు ఓ సలాహా ఇచ్చింది. కొత్తగా పెళ్లైన అమ్మాయిలకు మీరిచ్చే సలహా ఏంటని ప్రశ్నించగా.. ‘జైసీ హో వైసీ రహో..’ అని చెప్పింది. అంటే మీరు మీలాగే ఉండండి. మారడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే మీరు మీవల్లే ప్రేమించబడతారు. సమాజంలో గుర్తింపు పొందుతారుని ఎమోషనల్ డైలాగ్ చెప్పింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. సానియాకు మద్దతిస్తున్నారు. సానియా చెప్పినట్లు వినండని సూచిస్తున్నారు.