Ayodhya Rammandir: రాముడిని కూడా లోక్‌సభ అభ్యర్ధిగా నిలబెడుతుందేమో: సంజయ్ రౌత్
X
‘అయోధ్య రామమందిరం ఓపెనింగ్.. బీజేపీ ఈవెంట్’ అని శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు. మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కాబోయే రామమందిరం కోసం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశంలో రాముని పేరుతో చాలా రాజకీయాలు జరుగుతున్నాయని, ప్రస్తుతం ఇంకా మిగిలిన విషయం ఏంటంటే.. బీజేపీ అభ్యర్థిగా రామున్ని ఎన్నికల్లో నిలబెట్టడమేనని తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం మీడియా సమావేశం నిర్వహించిన సంజయ్.. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌ను జీరో అనడంపై క్లారిటీ ఇచ్చారు.
తానెప్పుడూ కాంగ్రెస్ పార్టీని జీరో అనలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జీరో నుంచి ప్రారంభం అవుతుందని చెప్తే, తన వ్యాఖ్యలను కావాలనే వక్రీకరించారని మండిపడ్డారు. మహారాష్ట్రంలో ఒక్క కాంగ్రెస్ ఎంపీ లేడని, తమవద్ద 18 మంది ఎంపీలు ఉన్నారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కాగ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందడంపై సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు. జనవరి 22న జరిగే ఈ కార్యక్రమాన్ని ‘బీజేపీ ఈవెంట్’ అని సంజయ్ రౌత్ ఇటీవల అభివర్ణించారు.