Home > జాతీయం > మరాఠా రిజర్వేషన్లకు సర్కార్ గ్రీన్‌ సిగ్నల్‌.. దీక్ష విరమించిన జరాంగే

మరాఠా రిజర్వేషన్లకు సర్కార్ గ్రీన్‌ సిగ్నల్‌.. దీక్ష విరమించిన జరాంగే

మరాఠా రిజర్వేషన్లకు సర్కార్ గ్రీన్‌ సిగ్నల్‌.. దీక్ష విరమించిన జరాంగే
X

మహారాష్ట్రలో మనోజ్ జరంగే పాటిల్ పోరాటం విజయవంతమైంది. మరాఠాల తరపున ఆయన చేసిన అన్ని డిమాండ్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతో నిరాదీక్షకు నేడు పాటిల్ తెరదించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పళ్లరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. మరాఠాలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మనోజ్‌ జరాంగే నేతృత్వంలో కొంతకాలంగా ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, వీరి డిమాండ్లను సీఎం ఏక్‌నాథ్‌ షిండే సర్కార్ పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించి తాడోపేడో తేల్చుకోవడానికి జరాంగే నేతృత్వంలో వేలమంది ముంబై దిశగా ర్యాలీ చేపట్టారు.

అయినా ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటంతో తాజాగా జరాంగే డెడ్‌లైన్‌ విధించారు. ‘రిజర్వేషన్ల కోసం ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్నది. ర్యాలీ దాదాపు ముంబై దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం చెప్పే మాటలు వినే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం శనివారం ఉదయం 11 గంటలలోపు అధికార ప్రకటన చేయాలి. లేకుంటే 12 గంటలకు కార్యాచరణ ప్రకటిస్తా. మా అడుగులు ముంబైలోని ఆజాద్‌ మైదాన్‌ దిశగానే పడుతాయి. ఒక్కసారి అడుగు పడిందంటే వెనక్కి తిరిగి చూసేది లేదు. మా డిమాండ్‌ను సాధించుకున్నాకే తిరిగి ఇంటికి వెళ్తాం’ అని జరాంగే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం నుంచే ఉపవాస దీక్ష చేస్తున్నామని, కేవలం నీళ్లు తాగుతున్నానని తెలిపారు. తమ న్యాయబద్ధమైన డిమాండ్‌ను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని వారు సూచించారు. వీరి డెడ్‌లైన్‌కు దిగివచ్చిన మహా సర్కార్‌.. డిమాండ్లను నెరవేర్చేందుకు అంగీకరించింది. దీంతో వారు దీక్షను విరమించారు.

Updated : 27 Jan 2024 11:44 AM IST
Tags:    
Next Story
Share it
Top