Home > జాతీయం > SBIలో ఉద్యోగాల జాతర.. ఏకంగా 8,283 క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్

SBIలో ఉద్యోగాల జాతర.. ఏకంగా 8,283 క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్

దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ(SBI Recuritment) భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ విభాగంలో మొత్తం 8,283 జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ నెల(నవంబర్) 17వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ డిసెంబర్ 7. జనవరి 2024లో ప్రిలిమినరీ పరీక్ష, ఫిబ్రవరిలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. జనరల్, ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థుల దరఖాస్తు ఫీజు కింద రూ. 750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

అర్హతలు..

అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తత్సమాన అర్హత గల పట్టాల పొంది ఉండాలి. వయసు 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల లోపుండాలి.

పరీక్ష..

ప్రిలిమినరీ పరీక్ష, స్థానిక భాషలో ప్రావీణ్యంపై 100 మార్కుల ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్‌లైన్లో పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీలపై మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు గంటలోపు సమాధానాలు గుర్తించాలి. ప్రిలిమ్స్ పాసైనవారికి మెయిన్స్ నిర్వహిస్తారు.

మరిన్ని వివరాలకు https://sbi.co.in/documents/77530/36548767/161123-JA+2023-Detailed+Advt.pdf/926d28be-7df8-36f3-7113-344404668498?t=1700129762521



Updated : 16 Nov 2023 8:29 PM IST
Tags:    
Next Story
Share it
Top