Home > జాతీయం > ఇండియా కూటమి కేసులో సుప్రీం కోర్టు తీర్పు వచ్చేసింది.. మీకేం పనిలేదా?

ఇండియా కూటమి కేసులో సుప్రీం కోర్టు తీర్పు వచ్చేసింది.. మీకేం పనిలేదా?

ఇండియా కూటమి కేసులో సుప్రీం కోర్టు తీర్పు వచ్చేసింది.. మీకేం పనిలేదా?
X

జాతీయ విపక్ష కూటమి ఇండియాకు(INDIA) సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. 26 అపోజిషన్ పార్టీల కూటమి ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్- ఇండియా పేరు పెట్టుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పువెలువరించింది. పిటిషన్‌లో పసలేదంటూ కొట్టేసింది. ఇండియా పేరుపై ఏవైనా అభ్యంతరాలుంటే ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాలని జస్టిస్ సంజయ్ కిషన్ లాల్ నేతృత్వంలోని ధర్మాసనం అక్షింతలు వేసింది. ‘‘ఇందులో ప్రజాప్రయోజన వ్యాజ్యం ఏముంది? అసలు మీకు దీనితో సంబంధం ఏమిటి? మీకేం పనిలేదా? ప్రచారం కోసం ఇదంతా చేస్తున్నారు. రాజకీయాల్లో నైతికతను నిర్ణయించడం మా పని కాదు. దీన్నివిచారించలేం’’ అని స్పష్టం చేసింది. రోహిత్ ఖేరీవాల్ అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశారు. దేశం పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని, ఇండియా పేరు వాడుకోకుండా విపక్షాలను ఆదేశాలివ్వాలని కోరారు. అయితే ఇండియా పేరుపై దాఖలైన మరో కేసులో ఢిల్లీ హైకోర్టు మాత్రం ఆ పార్టీలను వివరణ కోరుతూ నోటీసులు జారీచేసింది. ఈసీకి కూడా నోటీసులు పంపింది. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కాంగ్రెస్ సారథ్యంలో 26 విపక్షాలు బెంగళూరు వేదికగా ఇండియా పేరుతో ఏకతాటిపైకి వచ్చాయి. ఇండియా పేరును రాజకీయ పార్టీలు వాడుకోవడం 1950ల నాటి జాతీయ చిహ్నాల, పేర్ల చట్టానికి వ్యతిరేకమని పిటిషనర్లు వాదిస్తున్నారు.


Updated : 11 Aug 2023 10:33 PM IST
Tags:    
Next Story
Share it
Top