Home > జాతీయం > Honey Trap : వలపు వలతో సర్వం స్వాహా..సోషల్ మీడియాలో పెరుగుతున్న అరాచకాలు

Honey Trap : వలపు వలతో సర్వం స్వాహా..సోషల్ మీడియాలో పెరుగుతున్న అరాచకాలు

Honey Trap : వలపు వలతో సర్వం స్వాహా..సోషల్ మీడియాలో పెరుగుతున్న అరాచకాలు
X

మీరు అందమైన అమ్మాయితో మాట్లాడాలనుకుంటున్నారా? ఒంటరి మహిళతో చాట్ చేయండి ఇలా? అనుకుంటూ మీ ఫోన్ కు మేసెజ్ వస్తుందా అయితే తస్మాత్ జాగ్రత్త. కక్కుర్తి పడి కాల్ చేశారో అంతే సంగతులు. ముఖ్యంగా అబ్బాయిలు..ఫ్రెండ్ షిప్ చేద్దామనో..టైం పాస్ అనో కాల్ చేశారో..మీ జేబులు ఖాళీ అయ్యినట్లే. మోసంలో ఈ కొత్త పంథ పేరు హానీ ట్రాప్. పేరులోనే ఉంది తేనె లాంటి మాటలతో మిమ్మల్ని ట్రాప్ లో పడేస్తుంది. అసలు ఎలా ట్రాప్ చేస్తారు? ఎలా స్టార్ట్ చేసి డబ్బులు గుంజుతారు? ఇవన్నీ తెలియాలంటే లేట్ వాచ్ దిస్ స్టోరీ.

పెరుగుతున్న టెక్నాలజీతో రోజు రోజుకి మెసాల తీరు కూడా మారుతోంది. ఈజీ మనీ కోసం కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. మనుషుల బలహీనతలు, ఆశనే ఆసరాగా తీసుకొని కొంతమంది డబ్బులు కాజేస్తున్నారు. అందులోనూ ముఖ్యంగా సోషల్ మీడియా..చిన్నవారి నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ దీన్ని యూజ్ చేస్తారు. పొద్దున నిద్ర లేవగానే వాట్సప్ మెసేజ్ లు, ఫేస్ బుక్, ఇన్ స్టా చూడనిదే అసలు మన రోజు మొదలవ్వదు. అంతేగాక రోజంతా పని చేసి తీరా పడుకునే సమయానికి కూడా సోషల్ మీడియాలో ఏం జరిగిందా అని ఓ లుక్ వేస్తాం. అంతలా సోషల్ మీడియా మనలో భాగం అయిపోయింది. దీంతో యువతను మోసం చేసి క్యాష్ చేసుకునేందుకు కొందరు సోషల్ మీడియానే అడ్డగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా మహిళల పేరుతో సోషల్ మీడియాలో చేసే మోసాలు ఈ మధ్య ఎక్కువయ్యాయి.

హానీట్రాప్...ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న పేరు. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తంలో ఈ మత్తులో పడి చాలామంది ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నారు. వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్టా ఇలా సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత హనీ ట్రాప్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ముందు ఇలా హనీ ట్రాప్‌కు పాల్పడే వాళ్లు ఎక్కువగా..అమ్మాయిల పేరుతో, ఫొటోలతో సోషల్ మీడియాలో ఖాతాలు తెరుస్తారు. అంతే కాకుండా ఫేక్ ఫ్రోఫైల్స్, ఫేక్ బయోడెటా మంచి ఉద్యోగం అని అందులో రాసుకొస్తారు. ఆ తరువాత వాళ్లు టార్గెట్ చేసే వ్యక్తులను ఫాలో అవుతారు. ముందు ఏమి తెలవనట్టు మేసెజ్ చేస్తారు. తర్వాత మన వివారాలను కనుక్కొని మెత్తగా మాటలు కలుపుతారు. అలా పరిచయం పెంచుకుని నెంబర్ తీసుకుంటారు. రోజు ఫోన్ చేస్తూ స్నేహం పెంచుకుంటారు. తర్వాత ప్రేమించినట్లు నటిస్తూ… లైంగిక ప్రలోభాలకు గురి చేస్తారు. మెల్లగా వారి వ్యక్తిగత సమాచారం, రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. కొంత కాలంగా భారత్‌లో ఇలాంటి హనీ ట్రాప్ కేసులు పెరుగుతున్నాయి. దీని పట్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు పోలీసులు.

ఒంటరిగా ఉన్నా.. కొత్త ఫ్రెండ్స్‌ కావాలి.. కాల్‌ మీ ఎనీ టైమ్‌ అంటూ మెసేజ్ లతో వలపు వల విసిరి.. హనీ ట్రాప్‌లో చిక్కుకొనేలా చేస్తున్నారు ఆన్‌లైన్‌ కేటుగాళ్లు. సరే అని టెంప్ట్‌ అయ్యి మాట కలిపారో అంతే సంగతి...మొత్తం నిలుదోపిడి చేసేస్తారు. అంతేనా మీ పరువు కూడా పోతుంది. హానీ ట్రాప్...ఒకప్పుడు ఇది చాలా అరుదుగా వినిపించిన మాట. కానీ, ఇప్పుడు హనీ ట్రాప్‌లో పడిపోతున్న బాధితులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. మహిళలు వలపు వలవేసి డబ్బు సంపాదనే ధ్యేయంగా చాలా మంది యువతను బురిడీ కొట్టిస్తున్నారు. మరీ ముఖ్యంగా నగరాల్లో పెద్ద ఎత్తున ఇలాంటి మోసగాళ్ల బారిన పడుతున్నారు. తీరా అంతా అయ్యే సరికి వారు బయటకు పడేందుకు నానా తంటాలు పడుతున్నారు. అందులోనూ అమ్మాయిల చేతుల్లో మోసాపోయామని చెప్పుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు.

సమాజంలో మోసాల తీరు రోజురోజుకీ మారుతోంది. ఆశ చూపి మనుషుల వీక్ నెస్ లను క్యాష్ చేసుకుంటున్నారు కొందరు దుండగులు. ముఖ్యంగా అబ్బాయిలనే వారి టార్గెట్ గా ఎంచుకుంటున్నారు. అమ్మాయిల పేరుతో ఫేక్ ఫ్రొఫైల్స్ క్రియేట్ చేసి దోరికిన కాడికి డబ్బులు దోచుకుంటున్నారు. అందమైన అమ్మాయిలతో ఫొటోలతో సోషల్ మీడియాలో ఎకౌంట్ క్రియేట్ చేసి యువకుల జీవితాలతో ఆడుకుంటున్నారు. వారికి వలపు వల విసిరి ఆతర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు కాజేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతునే ఉన్నాయి. తీరా తాము మోస పోయామనే విషయాన్ని గ్రహించినప్పటికి..ఎవరికైనా చెప్పుకుంటే పరువు పోతుందనుకొని కొందరరైతే ఏకంగా ప్రాణాలు వదిలేస్తున్నారు. మరికొందరు డబ్బులు, పరువు రెండూ కోల్పోతూ మానసకింగా వారిలో వారే నలిగిపోతున్నారు.

మీకు దగ్గరలోని ఒంటరి మహిళలతో చాటింగ్‌, ఫోన్‌ కాల్స్‌ మాట్లాడాలనుకుంటున్నారా? అయితే ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండని అని ఫస్ట్ మేసెజ్ వస్తుంది. చేద్దాంలే అనుకొని కాల్ చేసాం అనుకో..అవతలి వైపు ఓ అమ్మాయి ఆకట్టుకునేలా మాట్లాడుతుంది. మెల్లగా రోజు ఫోన్ తరచూ ఫోన్‌ చేస్తూ మాటలు కలుపుతుంది. అనంతరం వాట్సాప్‌లో చాటింగ్‌కు పిలిచి న్యూడ్ ఫొటోలను పంపుతారు. అంతటితో ఆగకుండా న్యూడ్‌ కాల్స్ చేసి అవతలి వారిని కూడా అలాగే చేయమని రెచ్చగొడతారు. అంతే ఒక్కసారి అందులో చిక్కుకున్నమా.. బాధితులు న్యూడ్ గా ఉన్న వీడియోను స్క్రీన్‌ రికార్డింగ్‌ చేసి సేవ్‌ చేసుకుంటారు. తర్వాత ఆ వీడియోను సదరు వ్యక్తికి పంపించి బ్లాక్‌మెల్‌ షురూ చేస్తారు. ముందు కొంత డబ్బులు ఇవ్వమని లేకుంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తారు. అలా బాధితుల నుంచి లక్షల్లో డబ్బులు కొట్టేస్తారు. ఇలా వారు బిక్కుబిక్కుమంటూ వారికి డబ్బులు పంపిస్తూ భయపడుతుంటారు. ఇంకా డబ్బులు కావాలని లేకుంటే మీ ఇంటికి వీడియోలు పంపిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తారు. దీంతో బాధితులు అటు డబ్బులు ఇవ్వలేక..ఇటు ఎవ్వరికి చెప్పుకొలేక వారిలో వారే మదన పడుతూ చివరికి సూసైడ్ చేసుకుంటారు.

డేటింగ్ సైట్స్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లనే మోసం చేసేందుకు ఎక్కువగా ఎంచుకుంటున్నారు ఈ మోసగాళ్లు. తెలియని ఏవైనా లింకులు పంపించి ఒపెన్ చేయమంటే అలాంటి వాటికి దూరంగా ఉండడమే మంచిది. ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియాను వాడేటప్పుడు జర జాగ్రత్తగా ఉండడండి. ఇంకొసారి ఎవరి నుంచి అయిన తప్పుడు మేసేజ్ లు వస్తే వెంటనే ఆ నెంబర్లను బ్లాక్ చేయండి. అంతేగాక హానీ ట్రాప్ బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించడమే బెటర్.




Updated : 27 Feb 2024 10:32 AM IST
Tags:    
Next Story
Share it
Top