Home > జాతీయం > Bengaluru Bandh: నగరంలో 144 సెక్షన్.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు

Bengaluru Bandh: నగరంలో 144 సెక్షన్.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు

Bengaluru Bandh: నగరంలో 144 సెక్షన్.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు
X

బెంగళూరులో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కర్నాటక నుంచి తమిళనాడుకు కావేరి నదీ జలాలను నిరంతరం విడుదల చేయడంపై రైతులతో పాటు పాటు కన్నడ సంఘాలు ఈ బంద్కు పిలుపునిచ్చాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ బంద్ కొనసాగనుంది.

బెంగళూరు బంద్ కారణంగా జనజీవనం స్తంభించింది. నగరంలోని స్కూళ్లు, కాలేజీలు, గవర్నమెంటు ఆఫీసులు, బ్యాంకులు, ఏటీఎంలు, ప్రైవేటు రవాణా, రెస్టారెంట్లు, హోటళ్లు అన్నీ మూతపడ్డాయి. అయితే హాస్పిటళ్లు, నర్సింగ్ హోంలు, మెడికల్ షాపులతో పాటు అత్యవసర సేవలకు బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వ బస్సులు మాత్రం తిరుగుతున్నా అందులో ప్రయాణికులు మాత్రం కనిపించడం లేదు.

బంద్ నేపథ్యంలో నగర పోలీసులు సోమవారం అర్థరాత్రి నుంచి సిటీలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎలాంటి బంద్‌లకు అవకాశం లేదని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. ఒకవేళ ఆందోళనకారులు ప్రజల ఆస్తులకు నష్టం, ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. హింసాత్మాక ఘటనలకు తావు లేకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. నగరవ్యాప్తంగా 60 కేఎస్ఆర్‌పీ, 40 సీఏఆర్‌ ప్లటూన్‌లతో పాటు భారీ సంఖ్యలో పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated : 26 Sept 2023 9:01 AM IST
Tags:    
Next Story
Share it
Top