Delhi Weather : విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు మరో 5రోజులు సెలవులు
X
ఢిల్లీలో చలి తీవ్రత పెరిగింది. దీంతో ప్రైమరీ స్కూళ్లకు మరో 5 రోజులు సెలవులను పొడగించారు. ఇవాళ్టితో స్కూళ్ల సెలవులు ముగియాల్సి ఉండగా.. ఈ నెల 12వరకు సెలవులు పొడగిస్తూ ఆప్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
విద్యార్థుల కోసం ఆన్‌లైన్ క్లాసెస్ నిర్వహించుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది. అయితే 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలోనే తరగతులు నిర్వహించాలని సూచించింది.
అంతకుముందు ఈ నెల 10వరకు స్కూళ్లను మూసివేయాలని ఆప్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొద్దిగంటల్లోనే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. ఈ క్రమంలో ఈ నెల 12వరకు సెలవులను పొడిగించినట్లు విద్యాశాఖ మంత్రి అతిషి స్పష్టం చేశారు. కాగా ఢిల్లీలో చలి తీవ్రత కొనసాగుతోంది. పొగమంచు కారణంగా విజబిలిటీ చాలా తక్కువగా ఉంది. దట్టమైన పొగమంచుతో విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కొన్ని సర్వీసులను రద్దు చేయగా.. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే పాఠశాలలకు శీతాకాలపు సెలవులు పొడిగించాలని ఢిల్లీ విద్యాశాఖ నిర్ణయం తీసుంకుంది.