ICAR Recruitment 2023 : ఐసీఏఆర్ పరిశోధన సంస్థల్లో ఉద్యోగాలు.. అర్హులెవరంటే..
X
న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ASRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ (ICAR) ఆధ్వర్యంలోని పరిశోదన సంస్థలు/ కేంద్రాల్లో శాశ్వాత ప్రాతిపదికన సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత రంగంలో పీజీ, పీహెచ్ డీ ఉత్తీర్ణలై ఉండాలి. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 8లోగా దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఖాళీలు: 368
పోస్టులు: ప్రిన్సిపల్ సైంటిస్ట్- 80పోస్టులు, సీనియర్ సైంటిస్ట్ - 288 పోస్టులు
అర్హతలు : సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్.డీ ఉత్తీర్ణత. పరిశోధన/ బోధన అనుభవం.
వయోపరిమితి: ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్టుకు 52 ఏళ్లు, సీనియర్ సైంటిస్ట్ పోస్టుకు 47 ఏళ్లు.
పే స్కేలు: ప్రిన్సిపల్ సైంటిస్ట్ నెల జీతం రూ. 1,44,200 నుంచి రూ. 2,18,200. సీనియర్ సైంటిస్ట్ నెల జీతం రూ. 1,31,400 నుంచి రూ. 2,17,100.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ. 1500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు మినహాయింపు.
చివరితేదీ: సెప్టెంబర్ 08
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్
వెబ్‌సైట్: http://www.asrb.org.in