Seema Haider : లైవ్లో హద్దులు దాటిన సీమా హైదర్, సచిన్
X
సీమా హైదర్.. ఇటు భారత్, అటు పాకిస్తాన్ లో బాగా పాపులర్ అయిన పేరిది. పబ్జీ గేమ్ ద్వారా పరిచయం అయిన ప్రియుడు సచిన్ ను పెళ్లి చేసుకోవడానికి అడ్డ దారిలో సరిహద్దులు దాటి భారత్ లోకి ప్రవేశించి వార్తల్లో నిలిచింది సీమా. అలా చాలా కాలాంగా వార్తల్లో నిలిచిన ఈ జంట.. మరోసారి చర్చనీయాశంగా మారారు. తాజాగా ఓ నేషనల్ చానెల్ కు లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ జంట.. హద్దులు దాటింది. లైవ్ ఉన్న విషయాన్ని మర్చిపోయి సన్నిహితంగా మెదిలింది. దాంతో ఆ వీడియో క్లిప్ తెగ వైరల్ అవుతోంది.
చానెల్ లైవ్ లో ఉండగా సచిన్.. సీమాను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అది చూసిన యాంకర్.. కెమెరా రోలింగ్ లో ఉన్నారని, లైవ్ నడుస్తుంది, రొమాన్స ఆపాలని ఆ జంటను కోరాడు. దీంతో సీమా నవ్వుతూ సచిన్ కు దూరంగా వెళ్తుంది. ప్రస్తుతం వైరల్ కంటెంట్ గా ఉన్న వీళ్ల కథను సినిమా తీయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. టెలివిజన్, సినిమా ఆఫర్లు కూడా చాలా వచ్చాయి. అయితే వాటిలో దేనికీ ఈ జంట స్పందించలేదు. అయితే ప్రస్తుతం వస్తున్న వివరాల ప్రకారం బిగ్ బాస్ 17లో కంటెస్టెంట్స్ గా, కపిల్ శర్మ షోకు కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.