Home > జాతీయం > టార్గెట్ రీచ్ అవ్వలేదని తిట్ల దండకం.. బ్యాంక్ మేనేజర్ సస్పెండ్

టార్గెట్ రీచ్ అవ్వలేదని తిట్ల దండకం.. బ్యాంక్ మేనేజర్ సస్పెండ్

టార్గెట్ రీచ్ అవ్వలేదని తిట్ల దండకం.. బ్యాంక్ మేనేజర్ సస్పెండ్
X

పై స్థాయిలో ఉన్నానని.. ఏం చేసినా చెల్లుతుందని సహోద్యోగులతో ఇష్టారీతిలో ప్రవర్తించిన ఓ బ్యాంక్ మేనేజర్‌కు సరైన గుణపాఠం చెప్పింది బ్యాంక్ యాజమాన్యం. అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆన్‌లైన్ మీటింగ్ కి సంబంధించిన వార్త ఇంది. ఆ వీడియో మీటింగ్ లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పుష్పల్ రాయ్ తన తోటి ఉద్యోగులతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో సహోద్యోగులు తమ టార్గెట్లను అందుకోలేకపోయారని.. వారిపై అనుచితంగా ప్రవర్తించాడు. బెంగాలీ భాషలో ఉద్యోగులను వెక్కిరిస్తూ.. పదేపదే వారి నోరు మూసుకోండంటూ ఘాటైన స్వరంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఒక ఉద్యోగిని దుర్బాషలాడాడు. రోజుకు కనీసం 75 ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయించలేకపోటంపై ఉద్యోగులను తిట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యింది.

అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పుష్పల్ రాయ్‌ను సస్పెండ్ చేస్తూ కఠిన చర్యలు తీసుకుంది. ప్రాథమిక విచారణ ఆధారంగా సంబంధిత ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో పాటు బ్యాంక్ రూల్స్ ప్రకారం.. విచారణ కొనసాగుతోందని తెలిపింది. కార్యాలయంలో ఎలాంటి దుష్ప్రవర్తనకు పాల్పడినా ఉపేక్షించేది లేదని బ్యాంక్ స్పష్టం చేసింది. ఉద్యోగులందరికీ సమ గౌరవంగా చూడాలనే నియమాన్ని గట్టిగా విశ్వసిస్తుందని బ్యాంక్ తెలిపింది.





Updated : 6 Jun 2023 6:47 AM GMT
Next Story
Share it
Top