Home > జాతీయం > "రా" కొత్త చీఫ్గా సీనియర్ ఐపీఎస్ రవి సిన్హా

"రా" కొత్త చీఫ్గా సీనియర్ ఐపీఎస్ రవి సిన్హా

రా కొత్త చీఫ్గా సీనియర్ ఐపీఎస్ రవి సిన్హా
X

భారత నిఘా విభాగం రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్.. రా అధిపతిగా కేంద్రం రవి సిన్హాను నియమించింది. 1988 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆయనకు రా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రా అధిపతిగా ఉన్న సమంత్ కుమార్ గోయెల్ స్థానాన్ని రవి సిన్హా భర్తీ చేయనున్నారు. జూన్ 30న గెయెల్ రిటైర్ కానుండగా అదే రోజు రవి బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఛత్తీస్‌గఢ్‌ కేడర్‌కు చెందిన రవి సిన్హా రెండేళ్ల పాటు రా చీఫ్గా కొనసాగుతారని కేంద్రం ప్రకటించింది. 1988 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన రవి సిన్హా ప్రస్తుతం క్యాబినెట్‌ సెక్రెటేరియట్‌ స్పెషల్‌ సెక్రెటరీగా ఉన్నారు. ప్రస్తుతం అప్పాయింట్స్‌ కమిటీ ఆయనను RAW సెక్రెటరీగా నియమించినట్లు ప్రకటించింది.

రవి సిన్హా గత ఏడేళ్లుగా ‘రా’ ఆపరేషనల్‌ విభాగం చీఫ్గా సేవలు అందిస్తున్నారు. ఆయన ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. అయితే రవి సిన్హాకు సంబంధించిన వ్యక్తిగత వివరాలన్నీ గోప్యంగా ఉన్నాయి. ఇండియన్ ఇంటెలిజెన్స్‌ విభాగంలో ప్రతిభావంతుడిగా ఆయనకు పేరుంది. వివిధ విభాగాల్లో పనిచేసిన రవి సిన్హాకు పొరుగు దేశాల్లో జరిగే పరిణామాలపై మంచి పట్టుంది. ముఖ్యంగా ఆయన జమ్ముకశ్మీర్‌, ఈశాన్య భారత్‌, వామపక్ష తీవ్రవాదంపై పనిచేసినట్లు తెలుస్తోంది.

Updated : 19 Jun 2023 4:44 PM IST
Tags:    
Next Story
Share it
Top