Home > జాతీయం > సీనియర్ల పైశాచికత్వం.. బురదలో పడుకోబెట్టి.. ఆపై కర్రలతో..

సీనియర్ల పైశాచికత్వం.. బురదలో పడుకోబెట్టి.. ఆపై కర్రలతో..

సీనియర్ల పైశాచికత్వం.. బురదలో పడుకోబెట్టి.. ఆపై కర్రలతో..
X

ఆర్మీలాంటి కఠినమైన శిక్షణ ఉంటుందని తెలిసినా.. స్కూల్, కాలేజీల్లో ఎన్సీసీలో చేరుతుంటారు. అందులో సినియర్లతో విభేదాలు వస్తున్నా భరిస్తుంటారు. ఒక్కోసారి వాళ్ల వికృత చేష్టలు మితిమీరుతుంటాయి. మహారాష్ట్రలోని థానేలో కూడా అలాంటి ఓ ఘటనే జరిగింది. ఓ సీనియర్ ఎన్సీసీ క్యాడెట్ తన జూనియర్స్ పై పైశాచికంగా ప్రవర్తించాడు. వర్షం కురుస్తుండగా, చేతులు వెనక్కి పెట్టి, బురదలో తల పెట్టి పుష్ పొజిషన్ లో ఉంచాడు. తర్వాత కర్రతో వెనక భాగంపై క్రూరంగా కొట్టాడు. దాన్ని ఓ విద్యార్థి విడియో తీసిపెట్టగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

విద్యా ప్రసారక్ మండల్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన జూనియర్ క్యాడెట్స్ ఏడుస్తూ సీనియర్లను వేడుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్స్ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Updated : 3 Aug 2023 9:16 PM IST
Tags:    
Next Story
Share it
Top