Home > జాతీయం > మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి సంచలన వ్యాఖ్యలు

మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి సంచలన వ్యాఖ్యలు

మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి సంచలన వ్యాఖ్యలు
X

దేశ వ్యాప్తంగా మరోసారి మహారాష్ట్ర రాజకీయాలు వార్తల్లో నిలిచాయి. ఎన్సీపీని వీడిన అజిత్ పవార్ షిండే ప్రభుత్వంలో చేరడం సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ ఉండగా.. రెండో డిప్యూటీ సీఎంగా అజిత్​ పవార్​.. బాధ్యతలు స్వీకరించారు. ఇంక ముందు ముందు కూడా మహా రాజకీయాల్లో మరిన్ని పెరుమార్పులు చోటుచేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా రాజకీయాలపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్​ అగ్ర నేత.. హెచ్​డీ కుమార స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.





త్వరలోనే కర్ణాటకలో ఓ అజిత్​ పవార్​ పుట్టుకొస్తారని కుమార స్వామి అనుమానం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో శరద్​ పవార్​కు అజిత్​ పవార్​ టోపి పెట్టినట్లే కర్ణాటకలో కూడా జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చని చెప్పారు. కర్ణాటక రాజకీయాల్లో నవంబర్​లో కుదుపులు వస్తాయని చాలా మంది నాయకులు చెప్తున్నారని ఇది నిజమయ్యే అవకాశం ఉందని కుమారస్వామి అభిప్రాయపడ్డారు. ఎవరు అజిత్ పవార్ అవుతారో, ఏం జరుగుతుందో వేచి చూద్దామని వివరించారు. ప్రస్తుతం కుమార్ స్వామి వ్యాఖ్యలు కర్ణాటకలో చర్చనీయాంశంగా మారాయి.





Updated : 4 July 2023 12:07 PM IST
Tags:    
Next Story
Share it
Top