సర్వర్ డౌన్.. పనిచేయని యూపీఐ!
X
యూపీఐ సేవలకు అంతరాయం ఏర్పడింది. మంగళవారం సాయంత్రం నుంచి యూపీఐ లావాదేవీల్లో యూజర్లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా వారంతా ఫిర్యాదులు చేస్తున్నారు. యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడంలో ఇబ్బందిగా ఉందని వినియోగదారులు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే సర్వర్ డౌన్ కావడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని మరికొందరు సోషల్ మీడియా వేదిక పోస్టులు పెడుతున్నారు.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ అనేది దేశంలోనే వేగంగా లావాదేవీలు చేసేందుకు వినియోగించే సర్వీస్. ఈ యూపీఐ ద్వారా బ్యాంకు ఖాతాకు నేరుగా డబ్బులు జమ చేయొచ్చు. అలాగే డబ్బులను స్వీకరించవచ్చు. ఈ యూపీఐ లావాదేవీలు ఐఎంపీఎస్ ద్వారా ప్రాసెస్ అవుతాయి. ఈ సదుపాయం 24 గంటలూ, వారంలో ఏడు రోజులూ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
అయితే మంగళవారం సాయంత్రం నుంచి యూపీఐ సేవలకు అంతరాయం ఏర్పడటంతో యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు. త్వరగా సమస్యను పరిష్కరించాలని వారు యూపీఐను కోరుతున్నారు. చాలా మంది సోషల్ మీడియా వేదికగా యూపీఐ వల్ల కలిగిన ఇబ్బందిని చెబుతున్నారు. దీనిపై యూపీఐ ఇంకా స్పందించలేదు. అయితే ఈ రాత్రికి సమస్య పరిష్కారం అవుతుందని యూజర్లు భావిస్తున్నారు.