Home > జాతీయం > దాల్ సరస్సులో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన హౌస్ బోట్లు

దాల్ సరస్సులో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన హౌస్ బోట్లు

దాల్ సరస్సులో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన హౌస్ బోట్లు
X

జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఘోరం జరిగింది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన దాల్ సరస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. సరస్సులో ఉన్న హౌస్ బోట్లకు ఉదయం నిప్పు అంటుకోవడంతో అవన్నీ కాలి బూడిదయ్యాయి. మంటలు వ్యాపించి భారీగా ఎగిసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు.

దాల్ స‌ర‌స్సులోని 9వ నెంబ‌ర్ ఘాట్ వ‌ద్ద ఓ హౌస్ బోట్‌లో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. క్ష‌ణాల వ్యవధిలోనే మంట‌లు వ్యాపించాయి. దీంతో స‌మీపంలో ఉన్న బోట్ల‌న్నీ ఆ మంట‌ల్లో కాలి బూడిదయ్యాయి. 8 హౌస్ బోట్లు పూర్తిగా దగ్ధం కాగా, మరికొన్ని బోట్ల‌కు కూడా న‌ష్టం జ‌రిగింది. టూరిస్టులందరికీ రక్షించామని, ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు. అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.




Updated : 11 Nov 2023 7:40 AM GMT
Tags:    
Next Story
Share it
Top