Home > జాతీయం > బాంబు బెదిరింపులతో ఉలిక్కిపడిన బెంగళూరు స్కూల్స్

బాంబు బెదిరింపులతో ఉలిక్కిపడిన బెంగళూరు స్కూల్స్

బాంబు బెదిరింపులతో ఉలిక్కిపడిన బెంగళూరు స్కూల్స్
X

బాంబు బెదిరింపులతో బెంగళూరు ఉలిక్కిపడింది. పలు స్కూళ్లలో బాంబు పెట్టినట్లు మెయిల్స్ రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన పోలీసులు విద్యార్ధులను వెంటనే ఇళ్లకు పంపించి.. స్కూళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎటువంటి పేలుడు పదార్థం కనిపించకపోవడంతో అంతా ఫేక్ అని తేల్చారు. అయితే మెయిల్స్ పంపిన నిందితుల్ని కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నీవ్ అకాడమీ స్కూల్ను సందర్శించారు. పోలీసులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హోంమంత్రి జి.పరమేశ్వర సైతం బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా బెంగళూరులోని స్కూళ్లకు ఇలాంటి నకిలీ మెయిల్స్ రావడం ఇది రెండోసారి.


Updated : 1 Dec 2023 3:29 PM IST
Tags:    
Next Story
Share it
Top