Home > జాతీయం > Shehbaz Sharif : పాకిస్థాన్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్!

Shehbaz Sharif : పాకిస్థాన్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్!

Shehbaz Sharif : పాకిస్థాన్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్!
X

పాకిస్థాన్ లో ప్రధాని పీఠం ఎవరు దక్కించుకుంటారు అనే ఉత్కంఠకు తెరపడింది. నిన్న మొన్నటి వరకు రకరకాల పేర్లు వినపడ్డాయి. అయితే నవాజ్‌ షరీఫ్‌ (Nawaz Sharif) నేతృత్వంలోని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌- నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) (PML-N) పార్టీ అందరికి షాక్ ఇచ్చింది. నవాజ్‌ షరీఫ్‌ (Nawaz Sharif) అధికార బాధ్యతలు చేపడతారని అంతా ఊహిస్తున్న వేళ పీఎంఎల్-ఎన్ పార్టీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా షహబాజ్ షరీఫ్ ను(Shehbaz Sharif) నామినేట్‌ చేసింది. దీంతో షహబాజ్‌ మరోసారి పాకిస్థాన్‌ (Pakistan) ప్రధానిగా బాధ్యతలు తీసుకొనున్నారు. అయితే నాలుగోసారి నవాజ్‌ షరీఫ్‌ అధికారం చేపడుతారని అంతా అనుకున్నారు. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి మరియం ఔరంగజేబు ట్విటర్‌లో ఈ వివరాలు పోస్ట్ చేశారు.

తమ పార్టీ అధినేత నవాజ్‌ షరీఫ్‌ (Nawaz Sharif) తన సోదరుడు షహబాజ్‌ షరీఫ్‌ను ప్రధాని పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు అందులో చెప్పారు. ఇక నవాజ్‌ షరీఫ్‌ కూతురు మరియం నవాజ్‌ను పంజాబ్‌ ప్రావిన్స్‌ సీఎం అభ్యర్థిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విధంగా సంకీర్ణ ప్రభుత్వం రావడానికి మద్దతూ తెలిపిన పలు రాజకీయ పార్టీలకు నవాజ్ ధన్యవాదాలు తెలియజేశారు. ఇలాంటి నిర్ణయాల వల్ల పాకిస్థాన్‌ సంక్షోభాల నుంచి బయటపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

పాక్ ఎన్నికల్లో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం అనివార్యమైంది. దీంతో పాక్ సైన్యం ఆశీస్సులున్న పీఎంఎల్‌-ఎన్‌ పార్టీ బిలావల్‌ భుట్టో జర్దారీ (Bilawal Bhutto) నాయకత్వంలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (PPP)తో చర్చలు జరిపింది. అయితే ఇరు పార్టీలు అధికారాన్ని షేర్ చేసుకోనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ప్రధాని పదవి రేసు నుంచి తప్పుకుంటున్నట్లు పీపీపీ ఛైర్మన్‌ బిలావల్‌ భుట్టో ప్రకటించారు. కొత్త ప్రభుత్వంలో తమ పార్టీ భాగమవ్వకుండానే.. ‘పీఎంఎల్‌-ఎన్‌’ ప్రధాని అభ్యర్థికి మద్దతు ఇస్తుందని తెలిపారు. దీంతో నవాజ్‌ షరీఫ్‌ మరోసారి ప్రధాని బాధ్యతలు చేపడతారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆయన తన తమ్ముడిని ప్రధాని అభ్యర్థిగా నవాజ్ ప్రకటించారు.




Updated : 14 Feb 2024 7:45 AM IST
Tags:    
Next Story
Share it
Top