Home > జాతీయం > 'డప్పు కొట్టుకోవడం ఆపి.. వాస్తవాలని పరిశీలించండి..' రైల్వే శాఖపై ఎంపీ

'డప్పు కొట్టుకోవడం ఆపి.. వాస్తవాలని పరిశీలించండి..' రైల్వే శాఖపై ఎంపీ

డప్పు కొట్టుకోవడం ఆపి.. వాస్తవాలని పరిశీలించండి.. రైల్వే శాఖపై ఎంపీ
X

శివసేన (యుబిటి) ఎంపి ప్రియాంక చతుర్వేది రైల్వే మంత్రిత్వ శాఖపై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో వైరల్ ట్రెండ్‌లపై పోస్ట్‌లు పెట్టే ముందు రియాలిటీ చెక్ చేసుకోవాలని అన్నారు. శనివారం సూరత్ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఆమె రైల్వే మంత్రిత్వ శాఖపై మండిపడ్డారు. ట్విటర్ వేదికగా రైల్వే శాఖపై ధ్వజమెత్తారు. ఇదే సమయంలో తన ట్వీట్‌కి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని కూడా ఎటాచ్ చేశారు. ‘‘రైల్ మంత్రిత్వ శాఖ పబ్లిసిటీ కోసం తమని తాము ప్రశంసించుకుంటూ ట్వీట్లు చేయడానికి ముందు.. రియాలిటీని చెక్ చేసుకోవాలి. సూరత్ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన చాలా విచారకరమైంది. ఇది ఎంతో భయంకరంగా ఉంది’’ అంటూ ట్వీట్ చేశారు.

ఏదో ఒక చిన్న మంచి పని చేసి దానిపై గొప్పలు చెప్పుకోవడం కాదని, బయటకు వచ్చి రియాలిటీలో చోటు చేసుకుంటున్న తొక్కిసలాట ఘటనలపై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఓ వ్యక్తి మృతి చెందడం నిజంగా బాధాకరమైన విషయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఛత్ పండుగ కోసం బిహార్‌కు ప్రత్యేక రైలు వేయడంతో.. ప్రయాణికులు పోటెత్తారు. ఈ సందర్భంగా సూరత్ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరగ్గా.. 40 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాతే ఆ వ్యక్తి మృతికి గల కారణాలు తెలుస్తాయని స్మిమర్ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ జయేష్ పటేల్ తెలిపారు. మరో ఇద్దరికి కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు

Updated : 13 Nov 2023 10:54 AM IST
Tags:    
Next Story
Share it
Top