Home > జాతీయం > Lok Sabha Elections : అరుణాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్కు షాక్..బీజేపీలోకి ఎమ్మెల్యేలు

Lok Sabha Elections : అరుణాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్కు షాక్..బీజేపీలోకి ఎమ్మెల్యేలు

Lok Sabha Elections  : అరుణాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్కు షాక్..బీజేపీలోకి ఎమ్మెల్యేలు
X

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ కు గట్టి షాక్ తగిలింది. అరుణాచల్ ప్రదేశ్ లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేషనల్ పీపుల్స్ పార్టీ కి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకున్నారు. ఇటానగర్‌లోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఖండూ సమక్షంలో..కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే నినాంగ్ ఎరింగ్, వాంగ్లిన్ లోవాంగ్‌డాంగ్ లు, ఎన్ సీపీ లీడర్లు ముచ్చు మితి, గోకర్ బాసర్ లు కాషాయ పార్టీలో చేరారు. వారికి ఆ పార్టీ నేతలు కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ప్రధాని మోదీ నాయకత్వంపై నమ్మకంతో బీజేపీలో చేరినట్లుగా వారు తెలిపారు. 60 మంది సభ్యులున్న అరుణాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్, ఎన్‌పీపీలకు ఇద్దరు చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 53 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే ఈ ఏడాది చివర్లో అరుణాచల్ ప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి.





Updated : 26 Feb 2024 5:05 AM GMT
Tags:    
Next Story
Share it
Top