Home > జాతీయం > Taxi services : ఓలా, ఉబర్‌ సర్వీసులకు షాక్.. కొత్త రూల్ తెచ్చిన సర్కార్

Taxi services : ఓలా, ఉబర్‌ సర్వీసులకు షాక్.. కొత్త రూల్ తెచ్చిన సర్కార్

Taxi services : ఓలా, ఉబర్‌ సర్వీసులకు షాక్.. కొత్త రూల్ తెచ్చిన సర్కార్
X

నగరంలో ఎక్కువ మంది ఓలా, ఉబర్ వంటి ట్యాక్సీ సర్వీసులను ఉపయోగించుకుంటున్నారు. ప్రయాణం చేయడానికి వీటిపైనే ఆధారపడుతున్నారు. ఉన్న చోటు నుంచే రైడ్ బుక్ చేసుకుని తాము వెళ్లాలనుకున్న ప్రదేశాలకు వెళ్తున్నారు. అయితే బుక్ చేసుకున్నప్పుడు ఒక రేటు ఉంటే గమ్య స్థానానికి చేరిన తర్వాత మరో రేటు ఉంటుంది. సర్ ఛార్జీల బాదుడు, వెయిటింగ్ ఛార్జీలు, ఇలా ఏవేవో ఛార్జీలను ప్రయాణికులపై మోపుతున్నారు. దీంతో యూజర్ల జేబులకు చిల్లులు పడుతున్నాయి. దీనిపై ప్రభుత్వానికి భారీగానే ఫిర్యాదు అందాయి. దీంతో కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఓలా, ఉబర్ వంటి ట్యాక్సీ సర్వీసులు అడ్డగోలుగా ఛార్జీలు వేయకుండా ఆంక్షలు విధించింది. ఓలా, ఉబర్ సహా అన్ని ట్యాక్సీ సర్వీసుల సంస్థలకు ఫిక్స్డ్ ఫేర్ రూల్స్‌ను తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. కర్ణాటకలోని సిద్ధరామయ్య నేతృత్వంలో క్యాబ్ ఛార్జీలకు కళ్లెం వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిక్స్డ్ ధరలను వెంటనే అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. కొత్త రూల్ ప్రకారం..వాహనాల ఖరీదు ఆధారంగా క్యాబ్ సర్వీసులను 3 భాగాలుగా సర్కార్ విభజించింది.

రూ.10 లక్షలలోపు ఉన్న వాహనాల్లో అయితే తొలి 4 కిలోమీటర్లకు మించి ప్రయాణిస్తే కిలోమీటర్‌కు రూ.24లు అదనంగా చెల్లించాలి. అలాగే రూ.15 లక్షల మధ్య ఉన్న కారు అయితే 4 కిలోమీటర్ల తర్వాత రూ.115గా కిలోమీటరుకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వాహనం ధర రూ.15 లక్షలకు మించితే 4 కిలోమీటర్ల తర్వాత కిలోమీటరుకు రూ.130లు అదనంగా ఇవ్వాల్సి ఉంటుందని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ఇకపోతే యాప్ ఆధారిత ట్యాక్సీ సర్వీసులకు 5 శాతం జీఎస్టీ ఉంటుంది. దాంతోపాటుగా టోల్ చార్జీలను కూడా వసూలు చేసేందుకు సిద్ధరామయ్య సర్కార్ అనుమతులిచ్చింది. రాత్రి 12 తర్వాత క్యాబ్ సర్వీసులపై 10 శాతం అదనంగా వసూలు చేసుకోవచ్చని తెలిపింది. ఇక వెయిటింగ్ ఛార్జీ నిమిషానికి రూ.1 చొప్పున వసూలు చేసుకోవచ్చని వెల్లడించింది.


Updated : 5 Feb 2024 9:38 PM IST
Tags:    
Next Story
Share it
Top