Lok Sabha Elections : బీజేపీ నేత ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌కు షాక్.. రూ.10 కోట్ల పరువు నష్టం దావా!
X
బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ నాయకుల నుంచి టీపీసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ బెంజ్ కారును అందుకున్నారంటూ ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ చేసిన ఆరోపణలపై హస్తం పార్టీ స్పందించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధర ఆరోపణలు చేయడంపై దీపాదాస్ మున్షీ స్పందించారు.
ఆయనకు లీగల్ నోటీసులు పంపించింది. ఇక తనపై వచ్చిన ఆరోపణను దీపాదాస్ ఖండించారు. తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి 2 రోజుల్లో ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఆధారాలు చూపించకుంటే రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
తనపై నిరాధార ఆరోపణలు చేశారని దీపాదాస్ మున్షీ ఖండించారు. తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జీగా ఉన్న మాణిక్‌రావు ఠాక్రే స్థానంలో దీపాదాస్ మున్షీని డిసెంబర్‌లో కాంగ్రెస్ నాయకత్వం నియమించింది .అయితే, త్వరలో లోక్ సభ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఎంపీ టికెట్ ఆశావాహుల్లో ఒకరు దీపాదాస్ మున్షీకి బెంజ్ కార్‌ను బహూకరించినట్లు ఆయన ఆరోపించారు. దీపాదాస్‌కు బెంజ్ కారు కొనివ్వడంపై తనవద్ద పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. లోక్ సభ టికెట్ కోసం ఆమె ఎవరు కారును గిఫ్ట్‌గా ఇచ్చారన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. దీపాదాస్ మున్షీపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. దీపాదాస్ మున్షీ, ఆమెకు బహుమతి ఇచ్చిన నేతలు స్పందిస్తేనే తాను సమాధానం చెబుతానని, ఆధారాలు చూపిస్తానన్నారు. ఈ క్రమంలోనే తనపై చేసిన ఆరోపణలపై దీపాదాస్ మున్షీ, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌కు లీగల్ నోటీసులు పంపారు.