Home > జాతీయం > Food Poisoning : షాకింగ్.. క‌లుషిత ఆహారం తిని ఆస్పత్రిపాలైన 2000 మంది!

Food Poisoning : షాకింగ్.. క‌లుషిత ఆహారం తిని ఆస్పత్రిపాలైన 2000 మంది!

Food Poisoning : షాకింగ్.. క‌లుషిత ఆహారం తిని ఆస్పత్రిపాలైన 2000 మంది!
X

మ‌హారాష్ట్ర‌లోని నాందేడ్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మతపరమైన వేడుకలో కలుషిత ఆహారం తిని రెండు వేల మందికిపైగా అస్వస్థతకు లోనయ్యారు. లోహ తహిసిల్ ప్రాంతంలోని కోస్టివాడి గ్రామంలో నిన్న ఓ మతపరమైన ఈవెంట్ నిర్వహించారు. ఆ వేడుకకు స్థానికులతో పాటుగా ఇతర గ్రామస్తులు కూడా హాజరయ్యారు. సమీపంలోని సవార్గావ్, పోస్టవాడి, రిసన్‌గావ్, మాస్కీ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. సాయంత్రం అందరికీ అక్కడే భోజనాలు ఏర్పాటు చేశారు.

నిన్న సాయంత్రం 5 గంటలకు భోజనం చేసిన తర్వాత బుధవారం ఉదయం వాంతులు, విరోచనాలతో కొందరు నాందేడ్ లోని లోహ ఆస్పత్రిలో చేరారు. మొదటగా 150 మంది ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. అయితే అవే లక్షణాలతో ఇంకొందరు కూడా ఆస్పత్రిలో చేరారని అధికారులు తెలిపారు. శంకరో చావాన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 870 మంది పేషెంట్లు అడ్మిట్ అయినట్లు అధికారులు వెల్లడించారు.

నాందేడ్ గవర్నమెంటు ఆయుర్వేదిక్ ఆస్పత్రిలో ఇంకొన్ని బెడ్స్ ఏర్పాటు చేసినట్లుగా అధికారులు తెలిపారు. పేషెంట్ల నుంచి శాంపిల్స్ తీసుకుని దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు వెల్లడించారు. బాధిత గ్రామాల్లో సర్వే చేసేందుకు ఐదు బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనకు గల కారణాన్ని తెలుసుకునేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతానికి ఆ కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైనవారు క్షేమంగా ఉన్నారు. బాధితులెవరూ ప్రాణాలు కోల్పోలేదని పోలీసులు స్పష్టం చేశారు.


Updated : 7 Feb 2024 8:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top