రెచ్చిపోయిన వీధి కుక్కలు..సీసీ కెమెరాలో భయానక దృశ్యాలు
X
వీధి కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మనుషులు కనిపిస్తే చాలు ఎక్కడపడితే అక్కడ కండలను పీకేస్తున్నాయి. మరీ ముఖ్యంగా చిన్నారులపై శునకాల దాడులు మితిమీరిపోతున్నాయి. కుక్కల స్వైర విహారంతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల దాడిలో పలువురు చిన్నారులు ప్రాణాలను కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర్ప్రదేశ్లోనూ ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి జరిగింది. చాక్లెట్ కొనుక్కునేందకు షాపుకు వెళ్లిన బాలుడిపై ఒక్కసారిగా ఐదు కుక్కలు దాడి చేశాయి. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన భయానక దృష్టాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఈ భయంకరమైన సంఘటన జరిగింది. వీధికుక్కలు దాడి చేసిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. సీసీ కెమెరాలో ఇరుకైన సందులో ఒక బాలుడిపై ఐదు కుక్కల గుంపు ఒక్కసారిగా దాడి చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వీడియోను బట్టి చూస్తే, ఈ సంఘటన కెమెరాలో చిక్కక ముందు నుంచే బాలుడిని శునకాలు వెంబడిస్తున్నట్లు తెలుస్తోంది. కుక్కలు బాలుడిపై దాడి చేసి ఎక్కడపడితే అక్కడ కొరికేశాయి. పిల్లాడి అరుపులు విన్న స్థానికులు వెంటనే బాలుడి దగ్గరకు వచ్చి కుక్కలను కర్రలతో బెదిరించారు. దీంతో ఐదు కుక్కలు అక్కడి నుంచి పరారయ్యాయి. కుక్కల దాడిలో బాలుడు షాక్కు గురయ్యాడు. ఐదు కుక్కలు ఒళ్లంతా కరవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. కుక్కకాట్ల నంచి బాలుడు కోలుకోగానే అతనికి కౌన్సెలింగ్ ఇస్తామని వైద్యులు చెబుతున్నారు.
Horrible Video :
— Nitesh rathore (@niteshr813) August 14, 2023
उत्तर प्रदेश के जिला झांसी में 5 कुत्तों ने एक मासूम बच्चे पर अटैक कर दिया।#DOGATTACK #UTTARPRADESH #JHANSI #BREAKINGNEWS #LatestNews pic.twitter.com/f75OwRdOEp