Home > జాతీయం > పెళ్లైన ప్రియుడిని ఎత్తుకెళ్లిన మాజీ లవర్..ఆ తర్వాత ఏమైంది

పెళ్లైన ప్రియుడిని ఎత్తుకెళ్లిన మాజీ లవర్..ఆ తర్వాత ఏమైంది

పెళ్లైన ప్రియుడిని ఎత్తుకెళ్లిన మాజీ లవర్..ఆ తర్వాత ఏమైంది
X

ప్రియుడు మోసం చేశాడని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన అమ్మాయిలను చూసుంటాం... లేదా ప్రియుడి ఇంటి ముందు దర్నా చేసిన ప్రియురాళ్లను చూసుంటాం..కానీ ఈ ప్రేయసి మాత్రం వేరే లెవెల్ . తనను మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న ప్రియుడిని పక్కా ప్లాన్ వేసి మరీ కిడ్నాప్ చేసింది. పెళ్లైందని కూడా చూడకుండా తల్లి సహాయంతో తాళి కట్టించుకుని తనవాడిని చేసుకుంది. తమిళనాడులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. విషయం తెలుసుకున్న పోలీసులు యువతితో పాటు ఆమెకు సహకరించిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

చెన్నై వేళచ్చేరికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పార్తిబన్‌, సౌందర్య కాలేజీ రోజుల్లో లవ్ చేసుకున్నారు. 7 ఏళ్ల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ క్రమంలో పార్తిబన్ జులై 5వ తారీఖున తన తల్లిదండ్రులు చూసిన మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ యువతి ఓ సాఫ్ట్‎వేర్ కంపెనీలో జాబ్ చేస్తోంది. ఈ విషయం సౌందర్య చెవిలో పడటంతో పార్తిబన్‌ను మర్చిపోలేకపోయింది. అతడినే పెళ్లి చేసుకుంటానని తన తల్లి, బంధువులతో తేల్చి చెప్పింది. అయితే పార్తిబన్ కు పెళ్లి కావడంతో అతడిని కిడ్నాప్ చేయాలని సౌందర్య తల్లి, బంధువులు ప్లాన్ చేశారు. శుక్రవారం అతను ఎప్పటిలాగానే ఆఫీస్‎కు వెళ్లే సమయంలో మాటు వేసి కారులో వచ్చి అపహరించారు. వెంటనే పార్తిబన్‎ను కాంచీపురంలోని ఓ గుడికి తీసుకువెళ్లి బలవంతంగా సౌందర్య మెడలో తాళి కట్టించారు. పార్తిబన్ భార్య తన భర్త కిడ్నాప్‌ కు గురయ్యాడని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా సౌందర్యను నిందితులను గుర్తించారు. దీంతో సౌందర్యతో పాటు ఆమెకు సహకరించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated : 13 Aug 2023 3:25 PM IST
Tags:    
Next Story
Share it
Top