బ్రిజ్ భూషణ్పై ఎఫ్ఐఆర్లో సంచనల విషయాలు
X
లైంగిక వేధింఫుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్పై ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళా రెజ్లర్లతో ఆయన దారుణంగా వ్యవహరించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఛాతీపై తాకడంతో పాటు వారి పట్ల అసభ్య పదజాలన్నిఉపయోగించినట్లు ఎఫ్ఐఆర్ లో రాశారు. బ్రిజ్ భూషణ్ తమతో అనుచితంగా ప్రవర్తించడంతో పాటు దారుణంగా బెదిరించారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రెజర్లు ఆరోపించినట్లు ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించారు.
అభ్యంతరకర ప్రశ్నలు
బ్రిజ్ భూషణ్ కు భయపడి మహిళా రెజ్లర్లు ఎప్పుడూ తమ గదుల్లోనే ఉండేవారని బయటకు వచ్చేందుకు భయపడేవారని ఎఫ్ఐఆర్ లో ఉంది. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే గ్రూపులుగా వెళ్లినా ఎవరో ఒకరిని తీసుకెళ్లి అభ్యంతరకర ప్రశ్నలు అడిగేవారని, వాటికి సమాధానాలు చెప్పలేకపోయేవాళ్లమని ఓ బాధితురాలు తన ఫిర్యాదులో చెప్పింది. ఓ రోజు బ్రిజ్ భూషణ్ తన షర్ట్ లాగి, ఛాతీ, పొట్టపై అభ్యంతరకరంగా తాకారని మరో బాధితురాలు చెప్పింది. ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే శ్వాస ప్రక్రియను చెక్ చేస్తున్నట్లు చెప్పారని వాపోయింది. ఓ సారి తనకు తెలియని ఓ పదార్థం తీసుకొచ్చి తినమతి చెప్పాడని ఆరోపించింది.
సన్నిహితంగా ఉంటే
కోచ్ లేని సమయంలో తమ వద్దకు వచ్చి అభ్యంతరకరంగా ప్రవర్తించేవారని మరో రెజ్లర్ ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లో జరిగిన పోటీల్లో గాయపడ్డ తనవద్దకు వచ్చిన బ్రిజ్ భూషణ్ తనతో సన్నిహితంగా ఉంటే ట్రీట్ మెంట్ ఖర్చులను ఫెడరేషన్ భరించేలా చూస్తానని అన్నారని ఇంకో బాధితురాలు ఫిర్యాదులో చెప్పింది.
రెజ్లింగ్ ఫెడరేషన్ సెక్రటరీ వినోద్ తోమర్‌పైనా ఓ రెజ్లర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దిల్లీలోని డబ్ల్యూఎఫ్‌ఐ కార్యాలయానికి వెళ్లినప్పుడు.. తోమర్ తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. గదిలో ఉన్న వారందరినీ బయటకు పంపిం తనను బలవంతంగా ఆయనవైపు లాక్కొన్నారని బాధితురాలు తన ఫిర్యాదులో రాసింది.
రెజ్లర్ల ఆందోళన
బ్రిజ్ భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెజర్లు గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏడుగురు మహిళా రెజర్లు ఆయనపై ఫిర్యాదులు చేయడంతో ఢిల్లీలోని కన్నౌట్ ప్యాలెస్ పోలీసు స్టేషన్‌లో గత నెల రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఆరుగురు మహిళా రెజర్లతో మొదటి ఎఫ్‌ఐఆర్, మరో మైనర్ రెజ్లర్ తండ్రి ఫిర్యాదుతో రెండో ఎఫ్‌ఐఆర్‌ను ఏప్రిల్ 28న నమోదు చేశారు. అయితే ఈ ఆరోపణలను బ్రిజ్‌భూషణ్ ఖండించారు. రెజ్లర్లు చేసిన ఆరోపణలు నిజమని తేలితే తాను ఉరేసుకోడానికైనా సిద్ధమేనని తేల్చిచెప్పారు.