Home > జాతీయం > Sikkim: సిక్కింలో వరద బీభత్సం.. 102 మంది గల్లంతు..

Sikkim: సిక్కింలో వరద బీభత్సం.. 102 మంది గల్లంతు..

Sikkim: సిక్కింలో వరద బీభత్సం.. 102 మంది గల్లంతు..
X

ఈశాన్య రాష్ట్రం సిక్కింను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలతో రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయింది. ఈ వర్షాల వల్ల వరదలు సంభవించడంతో 22 మంది జవాన్లు గల్లంతైన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ వరదల్లో 14 మంది దుర్మరణం చెందారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. 22 మంది జవాన్లు సహా 102 మంది గల్లంతయ్యారు.

మంగళవారం అర్ధరాత్రి సిక్కింలో కుండపోత వర్షం కురిసింది. వాగులు, వంకలు, సరస్సులు పోటెత్తాయి. దీంతో తీస్తానదిలో..వరద ప్రవాహం ఒక్కసారిగా ప్రమాదకర స్థాయికి చేరింది. ఫలితంగా సమీపంలోని చుంగ్ తాంగ్ డ్యాంలోకి వరద ప్రవాహం పెరగ్గా.. నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాలు వరద గుప్పిట చిక్కాయి. వరద ఉద్ధృతికి సింగ్ తామ్ సమీపంలోని.. బర్దంగ్ ప్రాంతంలో సైనిక శిబిరాలు కొట్టుకుపోయినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. పార్కింగ్​లో ఉంచిన 41 సైనిక వాహనాలు మునిగిపోయాయి. వరదల కారణంగా 14 వంతెనలు కూలిపోయాయి. వీటిలో 9 బ్రిడ్జిలు బిఆర్‌ఓ పరిధిలో ఉండగా, 5 రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవి.

బుధవారం ఉదయం 23 మంది సైనికులు గల్లంతయ్యారు. రెస్య్కూ చేపట్టిన సహాయక బృందాలు.. ఓ సైనికుడు సహా 166 మందిని రక్షించాయి. ప్రస్తుతం సైనికుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని.. మిగతా వారి కోసం ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు డిఫెన్స్ అధికారి తెలిపారు. చుంగ్ తాంగ్ డ్యాం నుంచి.. ముందస్తు సమాచారం లేకుండా నీటిని విడుదల చేయటమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు చెప్పారు. గ్యాంగ్​టక్ జిల్లాలో తీస్తా నది వరద ఉద్ధృతికి సింగ్తమ్ ఫూట్ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. సిక్కిం సీఎం PS తమంగ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. సిక్కింలోని పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ.. సీఎం తమంగ్​తో ఫోన్లో మాట్లాడారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడంలో అన్ని విధాలా సహకరిస్తానని హామీ ఇచ్చారు.

Updated : 5 Oct 2023 4:19 AM GMT
Tags:    
Next Story
Share it
Top