Home > జాతీయం > బెంగళూరులో దారుణం.. చైనీయుడు అనుకుని చితక్కొట్టారు.. తీరా చూస్తే..

బెంగళూరులో దారుణం.. చైనీయుడు అనుకుని చితక్కొట్టారు.. తీరా చూస్తే..

బెంగళూరులో దారుణం.. చైనీయుడు అనుకుని చితక్కొట్టారు.. తీరా చూస్తే..
X

కర్నాటకలోని బెంగళూరులో దారుణం జరిగింది. చైనీయుడు అనుకొని కొందరు వ్యక్తులు సిక్కిం వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. నువ్వు చైనీయుడివి.. ఇక్కడ ఎందుకున్నావ్ అంటూ దాడి చేశారు. ఈ దాడిలో అతడికి తీవ్ర గాయాలవ్వగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అగస్ట్ 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పశ్చిమ సిక్కింలోని రించేస్పాంగ్‌కు చెందిన దినేశ్‌ సుబ్బా బెంగళూరులోని ఒక రెస్టారెంట్లో ఏడు నెలలుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 15న రాత్రి ఫ్రెండ్స్ రూంలో పార్టీ చేసుకుని తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంటికి వెళ్తుండగా ముగ్గురు దుండగులు అతడిని అడ్డుకున్నారు. చైనా చైనా అని అరుస్తూ అతడిని హేళన చేశారు. తాను భారతీయుడునని చెబుతున్నా వారు వినిపించుకోలేదు.

చైనా వాడికి ఇక్కడేం పని అని దూషిస్తూ ఇనుపరాడ్‌తో కొట్టారు. ఈ దాడిలో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Updated : 20 Aug 2023 8:48 AM IST
Tags:    
Next Story
Share it
Top