Singareni Election 2023 : సింగరేణిలో మోగిన ఎన్నికల నగారా
X
సింగరేణిలో ఎన్నికల నగారా మోగింది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అక్టోబర్ 28న ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎల్‌సీ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఎన్నికల నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారు. అక్టోబర్ 6, 7 తేదీల్లో నామినేషన్లు స్వీకరించనుండగా.. 9న విత్‌డ్రా, 10న స్క్రూటిని నిర్వహిస్తారు. అదేరోజు అభ్యర్థులకు సింబల్స్ కేటాయిస్తారు.
28న పోలింగ్ నిర్వహించి.. అదేరోజు కౌంటింగ్ చేపట్టనున్నారు. కాగా 2019లోనే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి ముగిసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా ఏదో కారణంతో వాయిదా వేస్తూ వస్తోంది. ఈ క్రమంలో అక్టోబర్లో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. దానికి అనుగుణంగా సీఎల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. అటు అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రధాని పార్టీలు నజర్ పెట్టాయి.