Home > జాతీయం > మురికివాడకు క్యూ కడుతున్న టూరిస్టులు ఎందుకంటే..?

మురికివాడకు క్యూ కడుతున్న టూరిస్టులు ఎందుకంటే..?

మురికివాడకు క్యూ కడుతున్న టూరిస్టులు ఎందుకంటే..?
X

ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్లమ్ ఏరియా అయిన ముంబైలోని ధారావి ఇప్పుడు టూరిస్ట్ స్పాట్‎గా మారింది. తాజ్ మహల్‎ను చూసేందుకు వచ్చేవారికన్నా ఈ స్లమ్ ఏరియాను చూసేందుకు పర్యాటకులు అధికంగా వస్తున్నారని తాజా నివేదికలు చెబుతున్నాయి. పర్యాటకులు ఈ ప్రాంతంలోనే గంటల తరబడి ఉంటూ వారి జీవన విధానాలను గమనిస్తున్నారు. దీంతో స్లమ్ టూరిజంకు ఆదరణ పెరుగుతోంది.

18వ శతాబ్దంలో కొంత మంది మత్స్యకారులు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వీరు జీవనాధారంగా కూలీనాలీ పనులు చేస్తుండేవారు. ఆ తర్వాత కాలంలో

మిగిలిన వారు ఈ ప్రాంతంలో ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. 20 వ శతాబ్దం నాటికి ఇక్కడ పరిస్థితుల్లో కొద్ది కొద్దిగా మార్పులు వచ్చాయి. జనాభా పెరగడంతో ఇక్కడ పాఠశాలలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, హాస్పిటళ్లు వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ స్లమ్ ఏరియా ఆసియాలో అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొందింది.

ధారావి స్లమ్ ఏరియా 550 ఎకరాల్లో విస్తరించింది. ఇక్కడి బస్తీలు లెక్కకుమించిన గుడిసెలతో నిండిపోయాయి. ఒక్కో గుడిసెలో 10 మందికిపైగా వ్యక్తులు నివాసం ఉంటున్నారు. దీనిని బట్టి వీరి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలుస్తుంది. ఈ మురికివాడలో దాదాపు 10 లక్షలకుపైగా ప్రజలు ఉండవచ్చని అంచనా. అందుకే ఇక్కడి పరిస్థితులను,ప్రజల జీవన విధానాన్ని గమనించేందుకు టూరిస్టులు అధిక సంఖ్యలో వస్తుంటారు. గంటల తరబడి వీరితో గడుపుతుంటారు. పేద ప్రజల జీవనం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా తెలుసుకుంటారు. అంతే కాదు కొంత మంది వీడియోలను తీసి డాక్యుమెంటరీలను రూపొందిస్తుంటారు. సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు.









Updated : 26 July 2023 3:38 PM IST
Tags:    
Next Story
Share it
Top