Home > జాతీయం > మరో రైల్లో పొగలు.. ప్రాణభయంతో దిగేసిన ప్రయాణికులు..

మరో రైల్లో పొగలు.. ప్రాణభయంతో దిగేసిన ప్రయాణికులు..

మరో రైల్లో పొగలు.. ప్రాణభయంతో దిగేసిన ప్రయాణికులు..
X

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం తర్వాత ఆ రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా పలుచోట్ల రైల్వే ప్రమాదాలు జరిగాయి. సోమవారం భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగగా మంగళవారం ఒడిశాలోనే మరో రైల్లోంచి పొగలు వచ్చాయి. దేశంలో అత్యంత సుదీర్ఘ ప్రయాణం చేసే వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఉన్నట్టుండి దట్టమైన పొగ కమ్ముకోవడంతో ప్రయాణికులు చైను లాగారు. బరంపురం (బ్రహ్మపురం) సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రైలు ఆగగానే ప్రయాణికులు ప్రాణభయంతో హడావుడిగా బోగీలు దిగారు. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానిక చేరుకుని తనిఖీ చేశారు.

‘‘రైల్లో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. చక్రాల దగ్గర బ్రేకుల్లో ఓ సంచి ఇరుక్కుపోవడంతో ఎస్ 10 బోగీ నుంచి పొగలు వచ్చాయి. బ్రేకులు అతుక్కుపోవడమే దీనికి కారణం. రైలును 20 నిమిషాలు ఆపి మళ్లీ పంపించాం’’ అని రైల్వే అధికారులు చెప్పారు. 4218 కి.మీ. ప్రయాణించే వివేక్ ఎక్స్‌ప్రెస్‌ దేశంలో సుదీర్ఘ ప్రయాణం చేసే రైలు. అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి మధ్య ఇది తిరుగుతుంది. ప్రయాణ సమయం 80 గంటలు.


Updated : 11 July 2023 12:27 PM GMT
Tags:    
Next Story
Share it
Top