Solar Eclipse : గ్రహణం వల్ల ఆ రాశి వారికి భారీ నష్టాలు
X
2024లో మొత్తం 4 గ్రహణాలు సంభవించనున్నాయి. అందులో తొలి చంద్రగ్రహణం మార్చి 25న రానుంది. ఆ తర్వాత తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 8వ తేదిన ఏర్పడనుంది. అయితే ఈ రెండు గ్రహణాలు భారత్‌లో కనిపించవు. ఈ గ్రహణాల వల్ల పలు రాశులపై ప్రభావం పడనుంది. మరి ఏయే రాశులకు నష్టాలు కలగనున్నాయి? ఏ రాశులవారు శుభవార్తలు వింటారనే విషయాలపై పండితులు ఏం చెప్పారో తెలుసుకుందాం.
తులారాశి:
తొలి సూర్యగ్రహణం వల్ల ఈ రాశివారికి కొన్ని ఇబ్బందులు తప్పవు. ఈ రాశివారిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పండితులు అంటున్నారు. వ్యక్తిగత సమస్యలు తలెత్తుతాయి. వృత్తిపరంగా కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండటం ఎంతో మంచిది.
కన్య రాశి:
ఈ రాశివారికి అనుకూల ఘటనలు జరుగుతాయి. కెరీర్‌లో మంచి జరుగుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. కుటుంబంలో సమస్యలు కొంత వరకూ తీరుతాయి. ఆదాయం కాస్త పెరుగుతుంది.
ధనస్సు రాశి:
సూర్యగ్రహణం వల్ల ఈ రాశివారికి అంతా మంచే జరుగుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది. అనుకున్న పనులను పూర్తవుతాయి.
మేషరాశి:
ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వైవాహిక జీవితంలో చికాకులు తప్పుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు.
సింహరాశి:
సింహరాశి వారికి సూర్యగ్రహణం వల్ల అంతా మంచే జరుగుతుంది. పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటాయి. చేసిన పనికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. సంపద రెట్టింపు అవుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది.