Home > జాతీయం > మణిపూర్‌లో ఆగని హింస.. ఆర్మీ జవాన్​ను​ కిడ్నాప్​ చేసి హత్య

మణిపూర్‌లో ఆగని హింస.. ఆర్మీ జవాన్​ను​ కిడ్నాప్​ చేసి హత్య

మణిపూర్‌లో ఆగని హింస.. ఆర్మీ జవాన్​ను​ కిడ్నాప్​ చేసి హత్య
X

దేశం కోసం ప్రాణాలను కూడా లెక్కచెయ్యని ఆ పోరాటయోధుడు.. తన కుటుంబ సభ్యులని చూడాలని సెలవు తీసుకుని వచ్చాడు. ఇంటికి రావడమే ఆ ఆర్మీ జవాన్ పాలిట శాపమైంది. గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ఆ వ్యక్తి ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడి జవాన్​ను ​కిడ్నాప్ చేసి.. అనంతరం ఈ దారుణానికి పాల్పడ్డారు. మణిపూర్‌లోని ఇంఫాల్ తూర్పు జిల్లాలో ఈ ఘటన జరిగింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని తరుంగ్ ప్రాంతానికి చెందిన సెర్టో తంగ్తాంగ్ కోమ్(41) దేశ రక్షణలో బాధ్యత వహిస్తున్న సైనికుడు. ఇటీవలె విధులకు సెలవులు పెట్టి ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం 10 గంటల సమయంలో గుర్తుతెలియని దుండగులు.. కోమ్​ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. అనంతరం అతడ్ని దారుణంగా కొట్టి కిడ్నాప్​ చేశారని సెర్టో తంగ్తాంగ్ కోమ్.. 10 ఏళ్ల కొడుకు తెలిపాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు.. కోమ్​ను వెతికే పనిలో పడ్డారు. ఎంతకీ అతని ఆచూకీ లభించలేదు. కానీ ఖునింగ్‌థెక్ గ్రామ పరిధిలో ఆదివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో జవాన్​ కోమ్.. విగతజీవిగా పడి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. అతడి తలపై బుల్లెట్ గాయాలు ఉన్నాయని వారు తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతామని వివరించారు. మృతుడు సెర్టో తంగ్తాంగ్ కోమ్​కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని పేర్కొన్నారు.




Updated : 18 Sept 2023 9:38 AM IST
Tags:    
Next Story
Share it
Top