Home > జాతీయం > Sonia Gandhi : పొల్యూషన్ ఎఫెక్ట్.. ఢిల్లీ వదిలిన సోనియా

Sonia Gandhi : పొల్యూషన్ ఎఫెక్ట్.. ఢిల్లీ వదిలిన సోనియా

Sonia Gandhi : పొల్యూషన్ ఎఫెక్ట్.. ఢిల్లీ వదిలిన సోనియా
X

ఢిల్లీలో గాలి నాణ్యత రోజు రోజుకు తగ్గిపోతుంది. ప్రజలు బయట తిరగడానికి భయపడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీ వదిలి తాత్కాలికంగా జైపూర్ వెళ్లారు. గత కొంత కాలంగా సోనియా గాంధీ ఆరోగ్యం అంతబాగోలేని విషయం తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఢిల్లీ వదిలి జైపూర్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రెండు నెలల క్రితం సోనియా గాంధీ శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో ఢిల్లీలో పెరిగిన గాలి కాలుష్యం వల్ల ఆమెకు ఇంకేదైనా ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉందని, అందుకే పొల్యూషన్ లేని ప్రాంతానికి మారాలని వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీతో కలిసి జైపూర్ చేరుకున్నారు.

గతంలో కూడా ఢిల్లీలో గాలి నాణ్యత తగ్గినప్పుడు సోనియా గాంధీ కొన్ని రోజులు గోవాలో ఉన్నారు. కాగా దీపావళి తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం స్థాయి తీవ్రంగా పెరిగిపోయింది. మంగళవారం ఏక్యూఐ 375 (తీవ్ర ప్రమాదకర స్థాయి)కు చేరుకుంది. జైపూర్‌లో ఏక్యూఐ 72 (మితస్థాయి)గా నమోదవుతుంది. అయితే త్వరలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉండటం కూడా సోనియా గాంధీ జైపూర్ వెళ్లడానికి కారణమే. అక్కడికి సోనియా రాజకీయ సభల్లో, ప్రచారంలో పాల్గొంటారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో వాటిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. సోనియా గాంధీ జైపూర్ వెళ్లింది రాజకీయాల కోసం కాదని.. ఆమె ఆరోగ్యం దృష్ట్యానే జైపూర్ చేరుకున్నట్లు స్పష్టం చేశారు.




Updated : 15 Nov 2023 12:26 PM IST
Tags:    
Next Story
Share it
Top