Home > జాతీయం > సోనియా గాంధీ భావోద్వేగపూరిత లేఖ.. లోక్‌సభకు పోటీ చేయకపోవడానికి కారణం ఇదే

సోనియా గాంధీ భావోద్వేగపూరిత లేఖ.. లోక్‌సభకు పోటీ చేయకపోవడానికి కారణం ఇదే

సోనియా గాంధీ భావోద్వేగపూరిత లేఖ.. లోక్‌సభకు పోటీ చేయకపోవడానికి కారణం ఇదే
X

ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ రాయ్‌బరేలీ నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగ లేఖ రాశారు. ఆరోగ్య సమస్యల కారణంగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నాట్లు ఆ లేఖలో తెలిపారు. 2004 నుంచి లోక్ సభకు పోటీ చేస్తూ వస్తోన్న ఆమె ఈసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. ఆరోగ్య సమస్సుల కారణంగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నాట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలం రాయ్‌బరేలీ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న ఆమె తన నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాస్తూ, ధన్యవాదాలు తెలిపారు. తర్వాత ఇదే నియోజకవర్గం నుంచి తమ కుటుంబంలోని వారే పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు ఆమె హింట్ ఇచ్చారు.

ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నాట్లు తెలుస్తోంది ఆరోగ్యం, వయస్సు కారణంగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని నియోజకవర్గ ప్రజలకు..ఓటర్లకు తెలిపారు. 'ఈ రోజు నేను ఏ స్థాయిలో ఉన్నా దానికి మీరే కారణమని గర్వంగా చెప్పగలన'ని రాయ్‌బరేలీ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఆమె పేర్కొన్నారు. మీ నమ్మకాన్ని నిలబెట్టేందుకు నేను నా వంతు కృషి చేశానని పేర్కొన్నారు. ఇంతకుముందు 2019 ఎన్నికల సమయంలో ఇవే చివరి లోక్‌సభ ఎన్నికలని ఆమె ప్రకటించారు. ప్రస్తుతం రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నా సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనుంది. ఆయన స్థానంలో ఇప్పుడు సోనియా నామినేషన్ వేశారు. సోనియా గాంధీ 1999లో అమేథీ నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా (ఎంపీ) ఎన్నికైనప్పుడు క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. తరువాత ఆమె లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా ఉండగా, 2004 సార్వత్రిక ఎన్నికలలో రాయ్‌బరేలీ నుండి గెలుపొందింది. సోనియా గాంధీ రాజస్థాన్‌ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగారు. బుధవారం రాజస్థాన్‌ అసెంబ్లీ భవనంలో ఆమె నామినేషన్‌ పత్రాలను సమర్పించిన సంగతి తెలిసిందే.




Updated : 15 Feb 2024 10:27 AM GMT
Tags:    
Next Story
Share it
Top