ప్రయాణికులకు అలర్ట్.. 50 రైళ్లు రద్దు
X
దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే పలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లు; విజయవాడ, గుంటూరు డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల నిర్వహణకు సంబంధించిన పనుల నేపథ్యంలో 50 రైళ్లను, క్యాన్సిల్ చేస్తున్నట్టు తెలిపింది. ఎనిమిది రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. అలాగే మరో ఐదు రైళ్ల సమయాల్లో తాత్కాలికంగా రీ షెడ్యూల్ చేసింది. జులై 3 నుంచి 9వ తేదీ వరకు రద్దు చేస్తున్న రైలు సర్వీసుల జాబితాలను విడుదల చేసింది. అదే విధంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో సర్వీసులందించే 22 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి.
దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసిన రైళ్ళ వివరాలు
Cancellation/Partial Cancellation/Diversions of trains@RailMinIndia @drmhyb @drmsecunderabad @drmned pic.twitter.com/EyRF63If3S
— South Central Railway (@SCRailwayIndia) July 2, 2023
Cancellation/Partial Cancellation/Diversions of trains @RailMinIndia @drmvijayawada @drmgnt pic.twitter.com/3BSb7ZYKli
— South Central Railway (@SCRailwayIndia) July 2, 2023
దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసిన ఎంఎంటీఎస్ రైళ్ళ వివరాలు
Cancellation of MMTS trains @drmsecunderabad @drmhyb pic.twitter.com/rQlkiOfhyC
— South Central Railway (@SCRailwayIndia) July 2, 2023