Home > జాతీయం > తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి 70 రైళ్లు రద్దు

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి 70 రైళ్లు రద్దు

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి 70 రైళ్లు రద్దు
X

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిధిలో నడుస్తున్న మొత్తం 52 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 18 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. గుండాలా- విజయవాడ సెక్షన్ పరిధిలో జరుగుతున్న నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ 70 రైళ్లను రద్దు చేస్తుంది. దీంతో ఈ నెల 22వ తేదీ నుంచి నెలాఖరు వరకు పలు రైళ్లు రద్దయ్యాయి. రద్దైన రైళ్లలో హైదరాబాద్ - వైజాగ్ మార్గంలో నడిచే జన్మభూమి, గరీబోథ్ కూడా ఉన్నాయి.





ఒడిస్సా రైలు ప్రమాద ఘటన తర్వాత రైళ్లై అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే మరమ్మత్తుల కోసం రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌర్యానికి చితిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. మరమ్మత్తుల్ని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి.. రైళ్లను పునరుద్దరిస్తామని తెలిపింది. దీంతోపాటు రేపటి నుంచి రద్దవుతున్న రైళ్ల వివరాలు..






Updated : 21 Aug 2023 4:53 PM GMT
Tags:    
Next Story
Share it
Top